తీన్మార్ మల్లన్న కేటీఆర్ కొడుకు హిమాన్షుపై అనుచిత పోల్ నిర్వహించడంపై టీఆర్ఎస్ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ..మల్లన్నను హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా ఇప్పటికే కేటీఆర్ మల్లన్న పై కేసు కూడ నమోదు చేశారు. మరోవైపు ఈ అంశాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలకు ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేసిన విషయం తెల్సిందే.. అయితే ఈ అంశంపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పందిస్తూ కొందరు బుద్ధి లేకుండా చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని, తాము ప్రభుత్వంలో ఉన్నాం…
కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ అధిష్టానానికి తలనొప్పులు తప్పడం లేదు. అయితే గతంలో బీజేపీ అధిష్టానం ఆ రాష్ర్ట ప్రస్తుత సీఎంను తప్పిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ దీనిపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లడం లేదని ఆయన చెప్పారు. దావోస్లో జరగబోయే…
మిషన్ 70. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ముందున్న టార్గెట్. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు కమలనాథులు. కొన్నిచోట్ల ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట. ఇంఛార్జుల వేటలో పడినట్టు చెబుతున్నారు. బీజేపీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారా? తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. బీజేపీ బలం ముచ్చటగా ముగ్గురు ఎమ్మెల్యేలు. అందులో రెండు ఉపఎన్నికల్లో గెలిచినవే. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన స్థానాలు ఎక్కువే. అయితే ఉప ఎన్నికల్లో గెలిచామన్న ధీమానో…
తీన్మార్ మల్లన్న వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తీన్మార్ మల్లన్నను ఉరికించి కొట్టాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఆయన జర్నలిస్ట్ కాదు…బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడని మండిపడ్డారు. మంత్రి కెటిఆర్ కుమారుడి గురించి ఇష్టారాజ్యాంగ మాట్లాడుతాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కెటిఆర్ ఫ్యామిలీ మీద మరొక్కసారి మాట్లాడితే మా గులాబీ సైన్యం బట్టలూడదీసి కొడతుందని హెచ్చరించారు. మా నేత కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా అభిమానులు ఊరుకుంటారా అని…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మునవర్ ఫారూఖిను తెలంగాణలో అడుగుపెట్టనిచ్చే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు అందరూ నాస్తికులేనని… నేనే అసలైన హిందువని…చెప్పుకునే కేసీఆర్… ముందుగా కుమారుణ్ణి భక్తుడిగా మార్చాలని చురకలు అంటించారు. స్వార్థం కోసమే సీఎం కేసీఆర్ యాగాలు చేస్తారని ఆగ్రహించారు. మునవర్ ఫారూఖీ వంటి మూర్ఖులకు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని మండిపడ్డారు. యువ మోర్చా నేతలు అలాంటి…
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో విత్తన ధృవీకరణ సంస్థ నూతన భవన,గోదాము శంకుస్థాపన చేసారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పారుక్ హుసేన్, జెడ్పి చైర్మన్ రోజా శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, వ్యవసాయ అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ… దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మార్కెట్ లను రద్దు చేశారు. ప్రభత్వలు రైతుల కోసం పనిచేయాలి.…
పెద్దవాళ్ల దగ్గర ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే.. ఏంటా కుప్పిగంతులు అంటారు. అదే ఓ స్థాయిలో ఉన్నవాళ్లు చేస్తే.. అంతా నవ్వి పోతారు. హస్తినలో ఆ పార్టీ నేతలు చేసిన పని అలాగే ఉందట. పెద్దాయన దృష్టిలో పడేందుకు.. మార్కులు కొట్టేసేందుకు తెగ తాపత్రయ పడ్డారట. అమిత్ షా చిరు నవ్వులు చూడగానే నేతలు అడ్వాన్స్ అయ్యారా? ముఖ్య నేతలంతా ఢిల్లీ రండి.. అమిత్ షా మాట్లాడతారని కబురు వెళ్లడంతో.. హస్తినలో వాలిపోయారు తెలంగాణ బీజేపీ నేతలు.…
విజయనరగంలోని రామతీర్ధం ఘటనలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ ఘటనకు వైసీపీ, టీడీపీలు బాధ్యత వహించాలని అన్నారు. ఇప్పటి వరకు ఆ ఘటనలకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి కేంద్రం సహకరిస్తోందని, హిందు ధార్మిక అలయాలన అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా నిధుల కేటాయించాలని అన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల అంశాన్ని వైసీపీ అనవసరంగా వివాదం చేస్తున్నదని అన్నారు. Read:…
తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ అసహానం వ్యక్తం చేశారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను ఇందులోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు శరీరంలోనా..? అంటూ తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడం పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు…
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ది హిందుత్వ ప్యారడిం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక ఆవిష్కరణలో రామ్ మాధవ్.. ఏపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. 150 సీట్లు వచ్చాయి కదా అని బలప్రయోగం చేయకూడదని… 150 అనేది కేవలం గెలవడానికి ఉపయోగపడే ఒక నెంబర్ మాత్రమేనని చురకలు అంటించారు. గెలిచాక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య పాలన జరగాలని సూచనలు చేశారు. పవర్ వచ్చింది కదా అని హోటల్…