తెలంగాణ రైతులను కేంద్రం అవమానిస్తుందని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకటి రెండు రోజుల్లో కేంద్రంస్పష్టత ఇవ్వాలన్నారు. రైతులతో రాజకీయం చేస్తున్నారు. “ఆహార భద్రత చట్టం” కింద దేశంలో ధాన్యం సేకరించడం కేంద్రం భాద్యత అని అన్నారు. భారత్ లో తెలంగాణ లేదా..? తెలంగాణ రైతులు భారత దేశ రైతులు…
వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఢిల్లీకి వెళ్లిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..ఇది చాలా గంభీరమైన విషయమన్నారు. మరోసారి సమీక్ష చేసి రైతాంగాన్ని సంప్రదించిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదన్నారు. అందమైన భాషలో ఉపన్యాసాలు ఇచ్చి, ఇదే దేశ భక్తి అంటే ఎలా…? అని…
కేంద్ర ప్రభుత్వ, బీజేపీ వైఖరి మారుతుందని వారం రోజుల నుంచి ఆశపడ్డాం అయినా.. వారిలో మార్పు లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయమని కేంద్రం తెలిపిందన్నారు. దీంతో వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే.. రాష్ట్రం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు. పీయూష్ గోయల్‌ను కలిసిన సమయంలో రిక్వెస్ట్ చేస్తే ఆయన పట్టించుకోలేదని… లిఖిత పూర్వకంగా…
ఇవాళ ఏపీలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర సహ ఇన్ చార్జ్ సునీల్ ధియోధర్ ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తోందని.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే…ఏపీలో మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలకు గత ప్రభుత్వం చంద్రన్న పేరు పెట్టుకుంటే.. ప్రస్తుత ప్రభుత్వం జగనన్న పేరుతో అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో మాటల యుద్ధ నడుస్తూనే ఉంది. ఇటీవల తెలంగాణ మంత్రులు ఢిల్లీ పెద్దలను ధాన్యం కొనుగోళ్లపై కలిసేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రులను అవమాన పరిచి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీ ల కోసం వెళతారు కానీ.. మేము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామంటూ ఆయన వ్యాఖ్యానించారు. అడుక్కోవడానికి మేము…
రైతులకు అన్యాయం చేయడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కనీస మద్దతుధర కల్పించడంలో కేంద్రం బాటలోనే రాష్ట్రం పోతోందని విమర్శించిన ఆయన.. కనీస మద్దతు ధర విషయంలో స్పస్టత ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు జీవన్‌రెడ్డి.. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 5 శాతం.. 3 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లర్లే దోపిడీ చేస్తున్నారని..…
సీఎం జగన్‌పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో జగన్ నియంత పాలన సాగిస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర రూ.18 వేలకు అమ్ముతున్నారని, మధ్య, పేద తరగతి కుటుంబాలపై తీవ్ర భారం మోపుతున్నారని ఆయన అన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థల గురించి పవన్ ప్రస్తావించాలని ఆయన కోరారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్ పథకాన్ని నిలిపివేయాలని,…
తెలంగాణ లో యాసంగి వరి ధాన్యం కొనుగోలు అంశం తెల్చకుండా రాష్ట్ర సీఎం కేసీఆర్ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రులు తిట్టిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు తెలంగాణ రైతులను దూరం చేయాలని కేంద్ర మంత్రులు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహించారు. ఈ వాన కాలంలో తెలంగాణ లో 62 లక్షల ఎకరాల్లో వరి పంట వచ్చిందని అన్నారు. కానీ తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం కేవలం 60 లక్షల టన్నుల వరి ధాన్యం…
ఢిల్లీ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో ఉన్నారో లేదో తెలుసుకోకుండానే మంత్రులు ఢిల్లీకి వచ్చారా అంటూ విమర్శించారు.చావు డప్పు కొట్టించారు..ముఖ్యమంత్రికి అసలు సిగ్గుఉందా.. అంటూ ప్రశ్నించారు. రైతులు ఆందోళన చెందద్దని చెప్పిన సీఎం కేసీఆర్, పూటకో మాట మారుస్తూ వరి వేస్తే ఉరి” అని…
పేదలకు పట్టాలు ఇచ్చిన స్థలంలో నర్సింగ్ కాలేజీ కట్టడం సిగ్గు చేటని, మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో వైద్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటనకు ముందు బీజేపీ నాయకులతో పాటు, అఖిలపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని డీకే అరుణ ఖండించారు. తను మంత్రిగా ఉన్నప్పుడు అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే, నేడు అదే స్థలం లో నర్సింగ్ కాలేజీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం…