ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లిక్కర్‌పై తాజాగా చేసిన కామెంట్లు వైరల్‌గా మారిపోయాయి.. ఇక, సోమువీర్రాజు వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.. అయితే, అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… సోషల్ మీడియా వేదికగా లిక్కర్ అమ్మకాలపై స్పందించిన ఆమె.. చీప్ లిక్కర్‌తో బీజేపీ.. ఖరీదైన మద్యంతో టీఆర్ఎస్ ప్రజలను దోచుకుంటున్నాయని ఫైర్…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు… మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆగ్రహ సభలో ప్రసంగించిన ఆయన.. కమ్యూనిస్టులు నీచులని, యూనియన్లతో వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఇక, కమ్యూనిస్టులు మొరిగే కుక్కలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అయితే, అదే స్థాయిలో కమ్యూనిస్టులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.. సోము వీర్రాజును పిచ్చి కుక్క కరిచిందని వ్యాఖ్యానించారు పి. మధు.. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. అసలు…
తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా వివాదం చెలరేగింది. తాజాగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే సీఎం కేసీఆర్, మంత్రుల బృందం వత్తిడి వల్లే కేంద్రం దిగివచ్చిందా? రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించిందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌కు కేంద్రం దిగొచ్చింది. సీఎం కేసీఆర్ కృషి, మంత్రుల దౌత్యం ఫలించింది. వానా కాలం పంటకు సంబంధించి రాష్ట్రం నుంచి అదనంగా బియ్యం సేకరించేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్రం నుంచి మరో…
ఏపీలో నిన్న బీజేపీ జనాగ్రహ సభ నిర్వహించింది. అయితే సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచిందని.. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.75 లకే ఇస్తామన్నారు. వీలైతే రూ.50కే చీప్ లిక్కర్ ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ఏపీలోని వైసీపీ, టీడీపీ నేతలు సైతం సోము వీర్రాజు మాటలపై మండిపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ఐటీ శాఖ…
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభ, నేతలు చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… టీడీపీ ఎజెండా ప్రకారమే బీజేపీ సభ నిర్వహించిందన్న ఆయన.. టీడీపీ, బీజేపీ, జనసేన… ఒకరు రాగం అందుకుంటే… మరొకరు పల్లవి అందుకుంటారు అంటూ సెటైర్లు వేశారు. ఎవరైనా ప్రజల సమస్యలపై మాట్లాడితే మేం సమాధానం ఇస్తాం.. కానీ, అలా కాకుండా వాళ్లే దేవాలయాలు కూలగొట్టేయటం, వాళ్లే ఆరోపణలు చేయటం రాజకీయమే అన్నారు. రాష్ట్రంలో…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవడేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. త్వరలో వారు మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన… ఏపీలోని కొందరు నేతలు బెయిలుపై ఉన్నారు.. త్వరలో జైలుకెళ్లే అవకాశం లేకపోలేదు అంటూ కామెంట్లు చేసి ఒక్కసారిగా రాజకీయాల్లో హీట్ పెంచారు… ఇక, నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్రానివి.. ఏపీలో…
సూర్యాపేటలో తెలంగాణ ప్రాంత శిక్షణ తరగతులలో భాగంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 124, 2018 లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయని, స్థానికత ఆధారంగా 3 సంవత్సరాల్లో బదిలీలు చేయాలని కోరారు. కానీ 3 సంవత్సరాలు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమిత అయ్యి, ఉద్యోగ, టీచర్ల సంఘాలతో చర్చలు జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కేసీఆర్ ఇప్పుడు పరుగులు పెడుతున్నారని ఆయన…
ఏపీ బీజేపీపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఎజెండానే బీజేపీ ఎజెండా అని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులు ఏపీలో బ్రాందీ ధరలు పెరిగినందుకు బాధపడుతున్నారని, వారు బాధపడాల్సింది డిజీల్, పెట్రోల్ ధరలు పెరిగినందుకు అని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు పెట్రోల్, డిజీల్ ధరలు ఇప్పటి ధరలు పరిశీలించాలన్నారు. అంతేకాకుండా సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు బీజేపీ పార్టీని లీజుకు ఇచ్చారని,…
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల ర్యాలీలతో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాత్రి కర్ఫ్యూ పెట్టి, పగలు ర్యాలీలకు లక్షల మందిని పోగు చేయడంతో సాధారణ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. Read Also:ఒమిక్రాన్‌పై యుద్ధానికి.. ఆ దేశంలో నాలుగో డోసు దీని వల్ల కేసుల సంఖ్య…
కేసీఆర్ విధానాలతో ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుందని బండి సంజయ్ అన్నారు. సోమవారం నిర్వహించిన ‘నిరుద్యోగ దీక్ష’ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గృహ నిర్భందం చేశారు. బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్‌కు వణుకుపుట్టిందన్నారు. ఇన్ని రోజులు సీఎంకు కోవిడ్ గుర్తుకు రాలేదు. ఈరోజు దీక్షకు వేలాది తరలివస్తున్నారని తెలిశాక కోవిడ్ గుర్తుకొచ్చిందా అంటూ…