లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు అమిత్‌షాకు బండి సంజయ్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిన్న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా బండి సంజయ్ దీక్ష చేస్తున్నారంటూ పోలీసులు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను నిలిపేందుకు బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి ఈ రోజు కరీంనగర్ కోర్టులో హజరుపరిచారు.
దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అయితే ఈ క్రమంలో బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిలతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళసైకి లేఖ రాశారు. తన హక్కులకు భంగం కలిగిందని స్పీకర్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా కరీంనగర్ సీపీ సత్యనారాయణపై కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే ప్రివిలేజ్ కమిటీకి కూడా బండి సంజయ్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!