నిన్న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తానికి నాటకీయ పరిణమాల మధ్య బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు బండి సంజయ్‌ను పోలీసులు కరీంనగర్ ఎక్సైజ్ కోర్టు హజరుపరిచారు.
దీంతో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ ను విధించింది.ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ ఘటనపై స్పందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మద్దతుగా శాంతియుతంగా జాగరణ చేస్తున్న బండి సంజయ్ పై టీఆర్ఎస్ సర్కారు అమానుషంగా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో పోలీసులను ఉపయోగించి బండి సంజయ్ ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.