కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ పై నిప్పులు చెరిగారు. శివరాజ్ సింగ్ చౌహన్, ఫడ్నవీస్, రమణ్ సింగ్, హేమంత బిశ్వశర్మ మీరంతా ఒకేసారి రండి రవీంద్ర భారతిలో కూర్చొని మీ రాష్ట్రాల అభివృద్ధి.. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుదామని సవాల్ విసిరారు. మా రాష్ట్ర మంత్రులు ఉంటారు…మీరు మీ…
సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చర్చ హాట్ టాపిక్‌గానే సాగుతోంది.. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య నెలకొన్న వివాదానికి తెరదించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. తాజాగా, సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.. రాంగోపాల్ వర్మను పిలిచి భోజనం పెట్టారు.. కానీ, విద్యార్ధుల కడుపు నింపే విషయాన్ని మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోదు అని మండిపడ్డారు.. సినిమా టిక్కెట్ల అంశంలో ప్రభుత్వం…
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది.. ఇదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గోవాలో అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. బీజేపీ షాకిస్తూ.. రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో రాజీనామా చేశారు.. మరో ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. కలంగుటే అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు…
చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావద్దని, అలా వస్తే మీరు దేశద్రోహులే అవుతారని ప్రధాని మోడీని ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోడీ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్, మోడీ దేశభక్తి నేతి బీరకాయలో నేతి అంత అని ఆయన ఎద్దేవా చేశారు. Read Also: పాల్వంచ ఘటన..రామకృష్ణ తల్లి, సోదరి అరెస్టు బీజేపీ నేతలు మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెబుతారని,…
బీజేపీ పై మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పై ధ్వజమెత్తారు. బీజేపీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. నల్లదనం తెచ్చి పేదల అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అన్నారు. ఏమైంది…? తెలంగాణకి వస్తున్న బీజేపీ ముఖ్యమంత్రలు 15 లక్షల ప్రస్తావన ఎందుకు తేవడం లేదు..? బీజేపీ చరిత్ర మార్చే కుట్ర చేస్తుంది తప్పితే చేసింది ఏం లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు మాట మీద…
రైతులకు కేసీఆర్ చేసిందేమి లేదని బీజేపీ సీనియర్ నేత రామచందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు బీజేపీ సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ , సీపీఎం, సీపీఐ పార్టీలు వేర్వేరు కాదన్నారు. అన్ని…
నిన్న వరంగల్‌లో బీజేపీ శ్రేణులు వచ్చి అధికార టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. సోమవారం మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వరంగల్‌లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదని, మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేని చవటలు బీజేపీ…
ఏపీలో ఉన్న వైసీపీది మతతత్వ ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆత్మకూరులో అనుమతి లేకుండా రెండు రోజుల్లో ఇళ్ల మధ్య మసీదులు కట్టారని, ఇళ్ల మధ్య మసీదు వద్దని చెబితే చంపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎంతోమందిని భయబ్రాంతులకు గురి చేశారని, చట్టాన్ని రక్షించాల్సిన ఉప ముఖ్యమంత్రి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేస్తామని, టీడీపీ నుండి బీజేపీకి వచ్చిన నేతలను కోవర్టులు…
రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా 317 జీవోను సవరించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని బాబాపూర్‌కు చెందిన సరస్వతి 317 జీవో మూలంగా స్వంత ఊరు నుంచి కామారెడ్డికి ట్రాన్సఫర్ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు పార్టీ నాయకులు మాజీ మంత్రి డాక్టర్ ఎ చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు ఎం ధర్మారావు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు విట్టల్, నిజామాబాద్ జిల్లా…
రెండు ఏళ్ల తర్వాత మీరు కోరుకున్న బీజేపీ ప్రభుత్వం వస్తే జీవో 317 లో బొంద పెడతాం అని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు మద్దతుగా వరంగల్ సభలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ను అరెస్టు చేస్తే బీజేపీ కార్యకర్తలు భయపడిపోతారని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ బీజేపీ కార్యకర్తలు భయపడరని బండి సంజయ్ అన్నారు. మాకు జైలు కొత్త కాదు ఇప్పటికి ఎనిమిది సార్లు వెళ్లాం. రాష్ట్ర…