కర్నూలు జిల్లాలోని నంద్యాలలో సుజన్‌రాజు కుటుంబ సభ్యులను ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పరామర్శించారు. సుజన్ రాజు కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని, ఆత్మకూరు ఘటన పై నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సోమువీర్రాజు అన్నారు. హిందూ మనోభావాలు గౌరవించే విధంగా ప్రభుత్వ, పోలీసు ల చర్య ఉండాలని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజకీయ పార్టీ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం పునాదులలాంటివన్నారు. పోలీసు, రెవెన్యూ రెండు వ్యవస్థలు గాడి తప్పితే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని సోమువీర్రాజు అన్నారు.