CM KCR Made Comments On Central BJP Government at Telangana Assembly Budget Sessions 2022.
ఈ నెల 7న ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన రోజున బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువలు మెడలో వేసుకొని నిరసన తెలిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పీకర్ వెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉంటే.. నేడు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. దేశంలో ఫెడరలిజం ప్రమాదంలో ఉందన్నారు. అధికార ప్రతిపక్షం అనే భేదాభిప్రాయాలు లేకుండా ఫెడరల్ స్ఫూర్తి పై చర్చ చేయాలన్నారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల విషయంలో రాష్ట్రాల హక్కులు కాల రాస్తుందన్నారు. వాళ్ళను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. ఓట్లు..సీట్లు లెక్క పెట్టుకోవడమే రాజకీయం కాదని, ప్రేమ పూర్వక దేశంలో విషబీజాలు నాటుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
బెంగుళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఐటీ లో రెండో ప్లేస్ లో ఉన్నాం, ఫార్మాకి ఫేమస్ హైదరాబాద్ అని ఆయన వ్యాఖ్యానించారు. మత కలహాలు పెట్టి హిజాబ్ పంచాయతీ పెట్టారని, ఆహార అలవాట్ల మీద పంచాయతీ, ప్రభుత్వంకి వీటి మీద సంబంధం ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. సంకుచిత ఆలోచన చేస్తే దేశం ఏమవుతుందని, ఉన్మాద చర్య ఇది అంటూ ఆయన ధ్వజమెత్తారు. అనేక వ్యయ ప్రయాసాల మీద నిలబడ్డా దేశం ఏం అవుతుందని, యూపీఏ మీద రకరకాల నిందలు మోపి…ఇప్పుడున్న ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందన్నారు.