Congress MLA Komatireddy Raj Gopal Reddy Made Sensational Comments.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన నాంపల్లిలో కార్యకర్తలనుద్దేశించి ఘాలు వ్యాఖ్యలు చేశారు. గౌరవం ఇవ్వని చోట నేను ఉండలేనని, ఎవరి కిందపడితే వారికింద పనిచేయలేనని ఆయన స్పష్టం చేశారు. క్యారెక్టర్ లేనోళ్లు, నైతిక విలువలు లేనోళ్లు పార్టీలో పెత్తనం చేస్తుంటే భాదేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలపై కేసీఆర్‌పై పోరాడుతూనే ఉంటానని ఆయన వెల్లడించారు. అయితే పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తానని ఆయన వెల్లడించారు.
నన్ను నమ్మిన వారు నా వెంట రావొచ్చునని, కేడరే నా బలం…కార్యకర్తలకు చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోనని ఆయన తెలిపారు. అయితే రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధపడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనే పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ గతంలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. ఆయన కమలం గూటికి చేరడం ఖాయమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.