Shashi Tharoor: మోడీ అద్భుతమైన నేత.. శశిథరూర్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.. ఏది మాట్లాడిన అందులో లాజిక్ ఉంటుంది.. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు, సెటైర్లు వేసే ఆయన.. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ శక్తిమంతమైన, డైనమిక్ లీడర్ అంటూ కితాబిచ్చారు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయంలో మోడీకి క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్న అన్నారు శశిథరూర్.. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022లో పాల్గొనేందుకు జైపూర్ వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడతూ.. రాజకీయంగా నరేంద్ర మోడీ చైతన్యవంతంగా ఉంటారని ప్రశంసించారు. మోడీ సారథ్యంలో బీజేపీ ఇంత భారీ తేడాతో గెలుస్తుందని తాను ఊహించలేదన్న ఆయన.. కానీ మోడీ నెగ్గి చూపించారని పేర్కొన్నారు.
Read Also: KTR: ఇలా చేయండి.. ప్రభుత్వ ఉద్యోగం మీదే..
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
మరోవైపు, భారతీయ ఓటర్లు ఎవ్వరికైనా షాక్ ఇవ్వగలరని వ్యాఖ్యానించారు శశిథరూర్.. ఒకరోజు బీజేపీకి కూడా వాళ్లు షాక్ ఇస్తారని తెలిపారు.. ప్రస్తుతానికైతే ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని.. ఇప్పుడు కాషాయ పార్టీ ఏం కోరుకుంటే అదే జరుగుతోందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ అద్భుతమైన శక్తి మరియు చైతన్యం ఉన్న వ్యక్తి అని, ముఖ్యంగా రాజకీయంగా చాలా ఆకట్టుకునే కొన్ని పనులు చేశారని అన్నారు. మరోవైపు.. మోడీపై విమర్శలు కూడా చేశారు శశిథరూర్.. మన దేశాన్ని మతపరమైన ప్రాతిపదికన విభజించే శక్తులను సమాజంలో నింపారని.. నా అభిప్రాయం ప్రకారం, ఇది ఒక విషాన్ని ప్రవేశపెడుతోంది.. ఇది దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజకీయ విశ్లేషకులు యూపీ ఎన్నికల ఫలితాలను “ముందస్తు ముగింపు”గా అభివర్ణించడంపై తాను ఆశ్చర్యపోయానని, ఎగ్జిట్ పోల్స్ వెలువడే వరకు చాలా తక్కువ మంది మాత్రమే బీజేపీ విజయాన్ని అంచనా వేశారని తెలిపారు.. ఎగ్జిట్ పోల్స్ వెలువడే వరకు చాలా మంది చాలా గట్టి ఫైన్ ఉంటుందని ఆశించారని పేర్కొన్నారు. ఇక, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరుపై స్పందించిన శశిథరూర్.. పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా విశేషంగా ప్రచారం చేశారని తెలిపారు.. అయితే, ఒక వ్యక్తి ప్రచారంతో కాంగ్రెస్ ను తప్పుపట్టొచ్చని తాను భావించడంలేదన్నారు.
తాజావార్తలు
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!