Mamata Banerjee: బీజేపీపై దీదీ షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించి ఫుల్ జోష్‌తో ఉన్న కమలనాథులకు షాకిచ్చే కామెంట్ చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. అప్పుడే ఆట ముగిసిపోలేదని.. మున్ముందు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేలలో సగం మంది కూడా లేని బీజేపీకి ఈ ఎన్నిక అంత ఈజీ కాదన్నారు. ప్రతిపక్ష పార్టీలకే దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారని చెప్పుకొచ్చారు మమత. యూపీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎస్పీ వంటి పార్టీలకు కూడా గతంలో కన్నా ఎక్కువ మంది శాసనసభ్యులున్నారని తెలిపారు. ఆట ఇంకా ముగిసిపోలేదని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మొదటి నుంచి బీజేపీ పేరు వింటేనే దీదీ కారాలు మిరియాలు నూరుతున్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తన స్వరాన్ని మరింత పెంచారు. దేశంలోని విపక్షపార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, కమలం పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్నారు.
Read also: Traffic Challan: ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్‌కు భారీ స్పందన..
Also Read
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
రాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీరిని ఎలక్టోరల్ కాలేజీ అంటారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఆ లెక్కన 233 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్‌సభ సభ్యులతో పాటు 4,120 మంది ఎమ్మెల్యేలు.. ఇలా మొత్తంగా 4,896 మంది రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేస్తారు. ఎంపీల ఓటు విలువ 708గా నిర్ణయించారు. ఎమ్మెల్యే ఓటు విలువ మాత్రం 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించారు. రాష్ట్రాలను బట్టి ఈ విలువ మారుతూ ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేల అందరి ఓట్ల విలువ కలిపి మొత్తం 10,98,903 అవుతుంది. ఇందులో 50 శాతం+1 ఓటు వచ్చిన వారు రాష్ట్రపతి అవుతారు. మరి దీదీ చెప్పినట్లుగా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కష్టాలు ఎదుర్కొంటుందా.. లేక సునాయసంగా గట్టెక్కుతుందో చూడాలి.
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!