APCC Working President Narreddy Tulasi Reddy Fired on BJP. బీజేపీ రణభేరిపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఆయన మాట్లాడుతూ.. కడపలో బీజేపీ రణభేరి సభ పెట్టి మరోసారి రాయలసీమ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, కడపలో బీజేపీ పార్టీ పెట్టిన సభ లాలూచీ, కుస్తీ సభ అని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ 5 ఏళ్ళు ప్రకటిస్తే దాన్ని బీజేపీ అమలు చేయలేదన్నారు. బీజేపీ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభా వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఇతర పార్టీల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి.. అధికార, ప్రతిపక్ష నేతలు ఇలా అంతా పవన్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, ఇవాళ పవన్ వ్యాఖ్యలపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. పవన్ కళ్యాణ్ ఎటూకాకుండా తలతిక్కతనంగా మాట్లాడారని ఎద్దేవా చేశారు.. బీజేపీ, వైసీపీ భార్య భర్తలు పెళ్లి చేసుకోకుండా ఎలా కాపురం చేస్తారో ఆ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ…
కడపలో ఈ రోజు రాయలసీమ రణభేరి సభ నిర్వహించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. సీమలో పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు రణభేరి సభకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ వేదికపై రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు, పెండింగ్ ప్రాజెక్టు సాధన కోసం వరుస ఆందోళనలు చేపట్టే దిశగా కార్యాచరణ ప్రకటించనున్నారు. రాయలసీమ విషయంలో తమ పార్టీ వైఖరి ఏమిటో మరోసారి స్పష్టం చేయనున్నారు. రాయలసీమ రణభేరి సభలో పెండింగ్ ప్రాజెక్టులు, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని…
స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా మళ్లీ కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ లో నిన్న ప్రారంభోత్సవం చేసిన నిధులు ఎక్కడి నుండి వచ్చాయో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న టీఆర్ఎస్ నాయకులు సభలో ఏది మాట్లాడినా నడుస్తుందనుకుని…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి… జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతీ ఎన్నికల్లో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకోవటం పవన్ కళ్యాణ్‌కు అలవాటు అంటూ ఎద్దేవా చేశారు. ఒక్కో ఎన్నికల్లో పవన్ ఒక్కొక్కరిని తిడుతూ మాట్లాడుతారని విమర్శించిన ఆయన.. అప్పుడు తిట్టి ఇప్పుడు మళ్లీ తిరిగి చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమవుతున్నారని.. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా పేదలకు ప్రభుత్వం…
నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించి ఫుల్ జోష్‌తో ఉన్న కమలనాథులకు షాకిచ్చే కామెంట్ చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. అప్పుడే ఆట ముగిసిపోలేదని.. మున్ముందు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేలలో సగం మంది కూడా లేని బీజేపీకి ఈ ఎన్నిక అంత ఈజీ కాదన్నారు. ప్రతిపక్ష పార్టీలకే దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారని చెప్పుకొచ్చారు మమత. యూపీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎస్పీ వంటి…
Congress MLA Komatireddy Raj Gopal Reddy Made Sensational Comments. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన నాంపల్లిలో కార్యకర్తలనుద్దేశించి ఘాలు వ్యాఖ్యలు చేశారు. గౌరవం ఇవ్వని చోట నేను ఉండలేనని, ఎవరి కిందపడితే వారికింద పనిచేయలేనని ఆయన స్పష్టం చేశారు. క్యారెక్టర్ లేనోళ్లు, నైతిక విలువలు లేనోళ్లు పార్టీలో పెత్తనం చేస్తుంటే భాదేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలపై కేసీఆర్‌పై పోరాడుతూనే ఉంటానని ఆయన వెల్లడించారు. అయితే పార్టీ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు డైరెక్షన్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఇటీవలి ఎన్నికల విజయంతో మంచి ఊపు మీద ఉంది. ప్రతికూల పరిస్థితులలోనూ ఉత్తరప్రదేశ్‌లో భారీ మెజార్టీతో అధికారం నిలబెట్టుకోవటం గొప్ప విశేషం. ఈ గెలుపుతో 2024 ఎన్నికల్లో కూడా తమదే విజయం అనే నిర్ధారణకు వచ్చారు కమలనాథులు. దాంతో, జాతీయ స్థాయిలో మరింత బలోపేతం అయ్యేందుకు పక్కాగా వ్యూహాలు రూపొందిస్తోంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలలో తమ వ్యతిరేకుల రాజకీయ నిర్మూలనపై ఫోకస్ పెట్టబోతోంది.…
డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమంటూ కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ తరచూ చెబుతున్నమాట.. అంటే, కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోనూ అదే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగంగా సాగుతుందని వారి ఉద్దేశం.. తాజాగా వెలువడని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది.. దీంతో.. మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్.. డబుల్ ఇంజన్ అభివృద్ధిపై బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే, వారికి…
CM KCR Made Comments On Central BJP Government at Telangana Assembly Budget Sessions 2022. ఈ నెల 7న ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన రోజున బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువలు మెడలో వేసుకొని నిరసన తెలిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పీకర్ వెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉంటే.. నేడు సభలో సీఎం కేసీఆర్…