OG 2 నుంచి వరుస ట్రీట్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాస్ కిక్ స్టార్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG 2 Updates: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘OG 2’పై ఆసక్తికరమైన అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ‘OG’కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ఇప్పటికే పూర్తయి, స్క్రిప్ట్‌ను కూడా మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉండటంతో ‘OG 2’ షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. 2027 సమ్మర్లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈలోపు డైరెక్టర్ సుజీత్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’ను పూర్తి చేయనున్నట్లు టాక్.
ఇక ‘OG 2’ స్టోరీ విషయంలోనూ మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘OG’లో కనిపించిన ఓజస్ గంభీర పాత్రకు సంబంధించిన అంతర్జాతీయ బ్యాక్‌డ్రాప్‌ను ఈ సీక్వెల్లో మరింత లోతుగా చూపించనున్నారట. ముఖ్యంగా ముంబై అండర్‌వరల్డ్‌లోకి అడుగుపెట్టకముందు ఓజస్కు జపాన్‌తో ఉన్న సంబంధం, అక్కడి సమురాయ్ సంస్కృతితో ముడిపడిన అతడి గతాన్ని ఈ సినిమాలో కీలకంగా ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు. ‘OG 2’లో పవన్ కల్యాణ్‌తో పాటు అంతర్జాతీయ నటుడు కజుకి కితామురా కీలక పాత్రలో కనిపించనున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనుండగా.. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయని సమాచారం. ఇక పవన్ కల్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న ‘OG 2’కు సంబంధించి ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కి ఈ చిత్రం నుంచి యానిమేషన్ ప్రోమోను రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘OG’కు మించి భారీ స్థాయిలో యాక్షన్, ఎమోషన్‌కు ప్రాధాన్యం ఇస్తూ సుజీత్ ఈ సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో ‘OG 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వన్స్ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ స్టార్ట్ అయితే పవన్ కల్యాణ్ అభిమానులకు వరుస ట్రీట్లు ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!