పశ్చిమ బెంగాల్లో మరోసారి హింస జరిగింది.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది.. దీనిపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.. ఇక, ఇప్పుడు బీర్భూం జిల్లా రామ్‌పుర్ హాట్ రాజకీయ హింసపై, అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పట్టణ శివారులోని బోగ్టూయి గ్రామంలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై ఇద్దరు చిన్నారులతో పాటు ఎనిమిది మంది సజీవ దహనం కావడం విషాదం నింపింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన…
కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ సర్కార్‌పై రెండు వైపుల నుంచి ఒత్తిడి చేస్తోంది తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ… ఓవైపు ధాన్యం, బియ్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి.. ఒత్తిడి తెచ్చే ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు.. గల్లీలోనూ బీజేపీపై పోరు సాగిస్తోంది.. గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలపై నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు..…
తెలంగాణలో మరోసారి ధాన్యం కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చింది. యాసంగిలో పండించిన ధాన్యం చివరి గింజ వరకు కేంద్రం కోనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే గులాబి దళం మంత్రులు హస్తినకు చేరుకొని కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో…
Telangana Energy Minister Jagadish Reddy About Paddy Procurement. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం వెనకబాటుకు గురైందని, బీజేపీ పాలనలో దేశం తిరోగమనం చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణలో సాగుతున్న సుభిక్షమైన పాలనను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఆయన…
Telangana Health Minister Harish Rao Fired on BJP and Congress Leaders. సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్పల్లి గ్రామంలో రైతు వేదిక, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్‌రావు శంకుస్ధాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15కోట్లతో 18కిమీ మేర ఈ గ్రామం మీదుగా డబుల్ లైన్ రోడ్ పనులకు శంఖు స్థాపన చేశామని ఆయన అన్నారు. మండే ఎండ కాలంలో కూడా కాళేశ్వరం నీళ్లతో చెరువులు…
మహారాష్ట్ర ప్రభుత్వంలోని నేతలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి.. వరుసగా జరుగుతోన్న ఘటనలు.. మొన్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్… నిన్న మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ జైలుకు పంపింది. తాజాగా ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బంధువు కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించిన ఈడీ.. ఠాణెలోని నీలాంబరి ప్రాజెక్టులో భాగమైన 11 రెసిడెన్షియల్ ఫ్లాట్లను అటాచ్ చేసింది.…
తెలంగాణ సర్కార్-కేంద్ర సర్కార్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.. యాసంగిలో పడించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో… తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ చేరుకుంది. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లు… ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రులను కలిసి… ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ రూపొందించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. Read Also: TS RTC: ఆర్టీసీకి…
ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై వేసిన సెటైర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ప్రకాష్ రాజ్ తాజాగా మరో సెటైర్ పేల్చారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రకాంత్ పాటిల్ ప్రధాని మోదీ రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పని చేస్తుంటారనీ చెప్పడంపై…
Minister Harish Rao Fired on Central Government. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతుందా లేదా అబద్దాల ఫ్యాక్టరీని నడుపుతుందా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన బిల్లును కేంద్ర సర్కార్ తొక్కి పెట్టిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన రాలేదని చెప్పిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ గిరిజనులకు కేంద్రం క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. కేంద్ర…
TPCC President Revanth Reddy Fired on BJP and TRS Governments. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు వివరించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దోపిడీని కేంద్రం చూసిచూడనట్లుగా ఉందని, సింగరేణి దోపిడీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. సింగరేణి దోపిడీపై సీబీఐ చేత పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ఇచ్చిన విజ్ఞప్తిపై ప్రధాని వెంటనే…