కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇవాళ మరో టూరిస్ట్ వచ్చాడంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ టూరిస్టుల సీజన్నడుస్తోందని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.
‘’వచ్చాడు.. తిన్నాడు.. తాగాడు.. వెళ్లాడు..’’ అంటూ అమిత్షాను ఉద్దేశించి సైటైర్ వేశారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏమి ఇవ్వలేదని, ఇప్పటికీ కూడా అదే తంతు ఇంకా కొనసాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ అంటే ‘బక్వాస్ జుమ్లా పార్టీ’ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా, కొంత కాలంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం – బీజేపీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో నిన్న నిర్వహించిన బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో కేంద్రహోం మంత్రి అమిత్ షా పాల్గొని టీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. అవినీతి, అసమర్ధ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.
Season of political tourism continues;
Ek Aur Tourist Aaj; Aaya, Khaya, Piya, Chal Diya 😁
8 Saal Mein Kuch Nahi Diya Telangana Ko, Aaj Bhi Wahi Silsila
Wahi Jhumlabaazi Aur Dhokebaazi
Living up to its nameB – Bakwaas
J – Jhumla
P – Party— KTR (@KTRTRS) May 14, 2022
అయితే.. కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.. తెలంగాణకు బీజేపీ చేస్తున్న అన్యాయాలపైన ప్రశ్నలు సంధించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉంటే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. తెలంగాణపై బీజేపీ పార్టీది అదే కక్ష అని… ఎనిమిదేళ్లు గడిచినా అదే వివక్ష. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదని ఫైర్ అయ్యారు.
ప్రతిసారి వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. మళ్లీ పత్తా లేకుండా పోవుడు. ఇదే బిజెపి కేంద్ర నాయకులకు అలవాటుగా మాదిందని… ఇంకెంతకాలం తెలంగాణపై ఈ నిర్లక్ష్య ధోరణి అని ఓ రేంజ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకుని వస్తావని అమిత్ షాను ప్రశ్నించారు కేటీఆర్.
CNG Prices: ఇప్పుడు సీఎన్‌జీ వంతు.. కిలోకు రూ.2 భారం