Ramayana : హాలీవుడ్లో క్రేజ్ కోసం అంత ఖర్చు అవసరమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రామాయణ’ నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఏదో ఒక రకంగా వార్తల్లో కాంట్రవర్సీ కావాల్సిందే. ఏడాది క్రితం ‘ది ఇంట్రడక్షన్’ పేరుతో రిలీజ్ చేసిన మూడు నిమిషాల వీడియోని గ్రాఫిక్స్‌తో మాయ చేయాలని చూశాడు దర్శకుడు నితీష్ తివారీ. ఇందులో చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టింది. ఇక రాముడిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఎలివేషన్ వర్కవుట్ కాలేదు.
ఎట్టకేలకు ట్రైలర్ ఓకే అనిపించుకున్నా, రిలీజ్ డేట్ కాంట్రవర్సీ అయింది. ‘రామాయణ’ నవంబర్ 6న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఇంతలోనే తూచ్ అంటూ విడుదల తేదీ మార్చేశారు. ఇండియాలో రిలీజ్‌కి 12 గంటల ముందే ఓవర్సీస్లో రిలీజ్ కావడం కామన్, కానీ రెండు రోజుల ముందే రావటం ఏంటో అర్థం కావటం లేదు. ఓవర్సీస్లో 6వ తేదీన, రెండు రోజుల తర్వాత ఇండియాలో 8వ తేదీన రిలీజ్ అవుతుందని ప్రకటించారు. హిట్ టాక్ వస్తే పర్వాలేదు, ఇండియాలో ఓపెనింగ్స్ పెరుగుతాయి. ఫ్లాప్ టాక్ వస్తే ఆ ఎఫెక్ట్ ఇండియా వసూళ్లపై పడుతుంది.
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
‘రామాయణ’ రెండు పార్టుల బడ్జెట్ ₹4000 కోట్లని నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పడంతో ఇదొక కామెడీ అయిపోయింది. రావణాసురుడిగా నటిస్తున్న యష్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుతూ రెండు పార్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ ఖర్చంతా కలిపి ₹4000 కోట్లని చెప్పాడు. ‘రామాయణ’ బడ్జెట్‌ని హాలీవుడ్ మూవీస్‌తో పోల్చాడు యష్. హాలీవుడ్ మూవీస్‌ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయడానికి ప్రమోషన్స్‌కి భారీగా ఖర్చు పెడతాయని, ఒక్కోసారి మేకింగ్ బడ్జెట్‌కి సమానంగా ఖర్చు చేస్తాయని అన్నాడు. హాలీవుడ్ మూవీస్ మార్కెటింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని, ఇదే పద్ధతిని ‘రామాయణ’ విషయంలోనూ అనుసరిస్తున్నట్టు యష్ వివరించాడు.
ఈ లెక్కన రెండు పార్ట్స్ బడ్జెట్ ₹2000 కోట్లు అయితే, ప్రమోషన్స్ కోసమే ₹2000 కోట్లు పెడుతున్నారా అంటూ నెటిజన్లు అడుగుతున్నారు. వరల్డ్‌వైడ్ ప్రమోషన్స్ కోసమే ₹2000 కోట్లా? ‘రామాయణ’కు హాలీవుడ్లో క్రేజ్ తీసుకురావడానికి అంత ఖర్చు పెట్టడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ నిజానికి హాలీవుడ్ మార్కెట్ పెద్దది, అక్కడ ఫోకస్ పడితే సినిమాల లెక్కలు మారిపోతాయి. రాజమౌళి కూడా ఇప్పుడు హాలీవుడ్ మీద ఫోకస్ చేయడానికి అదే రీజన్. కాబట్టి రామాయణ అక్కడ కూడా ఫోకస్ పెట్టడం పెద్ద వింతేమీ లేదు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!