Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Fire on BJP and TRS. బీజేపీ, టీఆర్ఎస్లపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను చనిపోయునప్పుడు మూడు రంగుల జెండాను కప్పమని చెప్పానని, కోమటిరెడ్డిది ఒకటే మాట….ఒకటే బాట అని ఆయన అన్నారు. ప్రధాని మంత్రి మోడీకి కేసిఆర్ అవినీతిపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశానన్నారు. సోషల్ మీడియాలో నాపై అబద్దఫు…
TPCC President Fired on BJP and TRS. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ను కలిశారు. మాణిక్కం ఠాగూర్‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంతో పోరాటం అని కేసిఆర్, మంత్రులతో సహా మాట్లాడుతున్నారని, కేసిఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, జైలుకు పోవడం ఖాయమని బీజేపి నేతలు మాట్లాడుతున్నారన్నారు. సింగరేణి బొగ్గు గనుల్లోని వేల…
అసలు ముందస్తుకు వెళ్లే ఆలోచనే లేదని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో అసెంబ్లీ స్థానాల్లో సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు.. ఆరు నూరైనా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు. ఎన్నికలు, సీట్లపై స్పందించిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్… కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్…
ఎంతకైనా పోరాటం చేస్తాం. ఎంతో రిస్క్ చేసి, పంటలు పండిస్తే ఇన్ని అవరోధాలా. కేంద్రం సమర్థత సరిగా లేదు. దేశంలో ఇలాగే ముందుకు పోతే నష్టాల పాలవుతారు జనం. ప్రజలకు జరుగుతున్నది తెలపాలి. మోడీకి చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాం. బీజేపీకి ఉద్యోగాలివ్వడం తేలీదు. ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చేయడం లేదు. ఇది రైతుల జీవన్మరణ సమస్య. రాజ్యాంగ విధి నుంచి కేంద్రం పారిపోవద్దు. కరోనాలాంటిది వస్తుందని మనం భావించామా? వారం పాటు దేశానికి అన్నం పెట్టే అవకాశం వుందా?…
తెలంగాణలో విస్తరించేందుకు పావులు కదుపుతోంది ఆర్ఎస్ఎస్. వచ్చే మూడేళ్లలో 25శాతం గ్రామాల్లో విస్తరించాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు చేస్తోంది. అందుకు గల అవకాశాలను వినియోగించుకుంటూ సభ్యత్వం పెంచుకోవాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా RSS శాఖలు పెరుగుతున్నాయ్. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం 60 వేల 929 శాఖలు దేశంలో యాక్టివ్‌గా ఉన్నాయ్. తెలంగాణలో కొత్తగా 175 గ్రామాలలో శాఖలు ఈ ఏడాది ప్రారంభమయ్యాయి.2024కి RSS ఏర్పడి వంద సంవత్సాలు…
దేశవ్యాప్తంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పెద్ద చర్చ సాగుతోంది.. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా లేకపోలేదు.. దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూలు చేసింది.. ఈ చిత్రంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సినిమాపై మండిపడ్డారు.. ఇవాళ తెలంగాణ భవన్లో…
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్‌రావు.. బోధన్‌లో నెలకొన్ని పరిస్థితులు, బంద్.. తదితర అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ.. భారత దేశంలో ఉందా..? లేక పాకిస్థాన్‌లో ఉందా..? అని నిలదీశారు.. కేసీఆర్ తన మహారాష్ట్ర పర్యటనలో ఛత్రపతి శివాజీని పొగిడారు.. కానీ, నిన్న బోధన్‌లో శివాజీ విగ్రహం అంశంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హిందువులపై దాడి చేశాయని ఆరోపించారు.. ఇక, దాడులకు…
నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో నిన్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి, టీయర్ గ్యాస్ ను కూడా వదిలారు. దీంతో ఆందోళన కారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే నేడు బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. ప్రస్తుతం నేడు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బోధన్ లో ప్రత్యేక…
All Political Parties Preparing for Elections. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహ రచన చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు మైకుల ముందు మేమంటే మేము అంటూ.. మైకుల పగిలేలా స్పీచులు ఇచ్చిన నేతలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ప్రత్యర్థులకు ఆలోచనలకు అందకుండా వ్యూహాలు రచించేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ఇతర పార్టీలు ఉన్నా.. తారాస్థాయి పోరుమాత్రం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ల మధ్యనే ఉండబోతోంది. ఇటీవల చేసిన కొన్ని…
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం తలెత్తింది. బోధన్‌లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే మైనారిటీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట బైఠాయించిన మైనార్టీ నాయకులు.. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అంతలోనే ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా…