యాసంగి ధాన్నాన్ని నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కొనుగోళు చేయనుంది. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పండిన ధాన్యం కేంద్రం కొనాల్సి ఉన్నా కొనకపోవడంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పండిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిలా రైతులు నష్టపోవద్దనే ఈరోజు నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారని ఆయన…
కాషాయ శిబిరంలో కషాయం డోస్ ఎక్కువైందా? కమలనాథుల్లో కలహాలు పెరిగాయా? నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయట పడుతున్నాయా? పార్టీ సారథి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయా? ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకొనే ఆ జాతీయపార్టీలో అసలేం జరుగుతోంది? కమలం శిబిరంలో ఏం జరుగుతోంది? తెలంగాణలో బీజేపీ పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉందా? నానాటికీ పార్టీ తీసికట్టుగా మారుతోందా? బీజేపీలోని ముఖ్య నాయకులు ఒకరి…
తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఒకవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ధరలు మండిపోతుంటే.. బీజేపీ నేతలు పాదయాత్ర చేయడాన్ని భట్టి తీవ్రంగా ఆక్షేపించారు. బండి సంజయ్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. ఎవరి కోసం సంజయ్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలన్నారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నావా..? మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారం లోకి…
యాసంగిలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా క్వింటల్ ధాన్యానికి ధర రూ.1960గా నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తన బాధ్యత విస్మరించినా.. రైతు మీద ప్రేమతో ముఖ్యమంత్రి కేసిఆర్ ధాన్యం సేకరణ చేస్తున్నారని ఆయన అన్నారు. యాసంగి ధాన్యం నూక శాతం నష్ట భారం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని…
భారత రాజ్యాంగకర్త డా. బీఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. బండి సంజయ్.. దేని కోసం యాత్ర చేస్తున్నారు.. పెట్రో.. డీజిల్ ధరలు పెంచినందుకా.. సంగ్రామ యాత్ర అంటూ విమర్శించారు. పేదల ఆదాయం తగ్గింది.. మోడీ ప్రభుత్వ ఆదాయం పెరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పైశాచిక ఆనందం…
పదవులు అనేవి కొంచెం కాలమే ఉంటాయని, పుట్టిన ప్రతి మనిషికి ఎప్పుడూ అవే పదవులు శాశ్వతం అనుకోవద్దని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పదవి శాశ్వతం అని ఎవరైనా అనుకుంటే అది పగటి కలలు కన్నట్లే అని వ్యాఖ్యానించారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదవులు అనుభవించి కాలగర్భంలో కలిసిపోయారని, కానీ ప్రజల కోసం పాటు పడినవారే ప్రజల గుండెల్లో నిలిచిపోతారని చెప్పారు. చనిపోయినా, పదవినుంచి దిగిపోయినా, ఏ పదవీ లేకున్నా…
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఇరుక్కుని.. రాజకీయంగా ఉనికి కోల్పోయిన ఆ మాజీ మంత్రి.. కొత్తగా పక్కచూపులు చూస్తున్నారా? ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్నప్పటికీ సంతృప్తిగా లేరా? కొత్తగూటిలోని లెక్కలు ఏం చెబుతున్నాయి? ఎవరా మాజీ మంత్రి? ఏమా కథా? రాజకీయ భవిష్యత్ కోసం పక్కచూపులు సి. కృష్ణయాదవ్. ఒకప్పుడు హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఈ మాజీ మంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణయాదవ్ లెక్కేవేరు. కానీ.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ…
మరో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి… కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లి రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజా పరిస్థితులపై గవర్నర్ కు నివేదిక ఇచ్చామన్నారు.. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు..…
ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ స్పష్టతను ఇచ్చారు. నేడు తెలంగాణ కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆహార భద్రతలో భాగంగా ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత… భరించాలి… కానీ కేంద్రం తప్పించుకుంటుందని ఆయన మండిపడ్డారు. కేంద్రం దగ్గర డబ్బులు లేవా… ప్రధానికి మనస్సు లేదా అని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే పాపాల పుట్ట బయట పెడతామని, లండన్ లో…
నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కేబినెట్లో నిర్ణయించిన విషయాల గురించి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగ కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంపై మహా సంగ్రామం మొదలు పెడతామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కాలుకు వేస్తే మెడకు మెడకు వేస్తే కాలుకు వేస్తుందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి మెదడు జ్ఞానం బుద్ధి ఉందా… సోమరిపోతు ల…