ఏపీలో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. మంత్రులను మార్చడం కాదు.. ముఖ్యమంత్రి నే మారిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది. సత్యసాయి జిల్లాలో వెనువెంటనే రెండు ఘటనలు జరిగాయి. నిన్న నెల్లూరు లో తుపాకీ తో ప్రేమోన్మాది కాల్చి చంపిన ఘటన విచారకరం అన్నారు. రాష్ట్రం లో చిన్న ఘటనలు జరుగుతున్నా సిఎం స్పందించరా అన్నారు. హోం మంత్రి ఈవిషయాల పై నోరు మెదపరా. గవర్నర్…
కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ఈ కామెంట్స్ అనేక సందేహాలకు.. చర్చకు కారణం అవుతున్నాయి. టీడీపీ వన్‌సైడ్ లవ్వు.. జనసేనను కన్నుగీటడం.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రకటన.. ఇంతలోనే అందరం కలవాలి.. త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు స్టేట్మెంట్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. దీంతో బంతి బీజేపీ కోర్టులో పడింది. కాషాయ పార్టీ 2014ను రిపీట్ చేస్తుందా? బద్ధ…
ఆంధ్రప్రదేశ్‌లో బీ-ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసు సంచలనంగా మారింది.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన తేజస్విని మృతికేసును దిశ పీఎస్‌కు అప్పగించారు.. అయితే, ఈ కేసులో వెలుగు చూస్తున్న నిజాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏపీ బీజేపీ నేతలు.. బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని మరణంపై విచారణ జరిపించాలని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని కోరారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పొత్తుల గురించే మొత్తం చర్చ… ఏ పార్టీ నేత నోట విన్నా.. అదే మాట… పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీని టార్గెట్ చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పవన్ కల్యాణ్.. బీజేపీ, టీడీపీలతో కలిసి పోటీ చేస్తారా..? లేక బీజేపీని వదిలి టీడీపీతో కలిసి పోటీ చేస్తారా..? అని నిలదీశారు. ఇక, చంద్రబాబు, పవన్…
తెలంగాణ రాజకీయాల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చుట్టూ చర్చ సాగుతూనే ఉంది.. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరతారు? అనే ప్రశ్న అందరినీ తొలచివేస్తోంది. అయితే, ఆయన ఏ పార్టీ నేతలను కలిసినా.. ఆ పార్టీలో చేరతారు అనే ప్రచారం ఎప్పటికప్పుడు సాగుతూనే ఉంటుంది. తాజాగా, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సమావేశం కావడంతో.. మరోసారి పొలిటికల్ పార్టీ రీ ఎంట్రీ చర్చ తెరపైకి వచ్చింది. అయితే, తాను ఏ…
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భనం ఇలా ప్రతీ అంశంపై ట్విట్టర్ వేదికపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర అవలంభిస్తున్న తీరుతో పాటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై కేటీఆర్ మోదీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్రంపై ట్విట్టర్…
కాకినాడ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. మరోసారి ఎన్నికల పొత్తులపై చర్చకు దారితీశాయి.. దీనిపై విమర్శలు కూడా గట్టిగానే వచ్చాయి.. అయితే, కాకినాడలో తన కామెంట్లను వక్రీకరించారని తెలిపారు చంద్రబాబు. టీడీపీ ముఖ్య నేతలు, క్షేత్ర స్థాయి నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. వైసీపీవి డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు.. తన బలహీనతలను అధిగమించడానికి వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తోందని మండిపడ్డారు. భీమిలి పర్యటనలో ప్రజలు…
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై బీజేపీ నిలదీస్తోంది. తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ మూర్ఖుడు, ఆదివాసీ, గిరిజన వ్యతిరేఖి అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గిరిజనులకు 9.8 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కులాన్ని,…
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ, ఏయే పార్టీలు ఎవరెవరితో చేతులు కలపనున్నాయన్న అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీ నేతలందరూ దీనిపై స్పందిస్తున్నారు. తాజాగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ విషయంపై స్పందించారు. పొత్తుల విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని, జనసేనతో పొత్తు కొనసాగుతోందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే.. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందా? లేదా?…
రూ.102 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభం చేసుకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 56 రకాల ఆరోగ్య పరీక్షలు రేడియాలజీ, పతలాజి ల్యాబ్ లకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీశ్ రావ్. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు రోగ నిర్దారణ కోసం ఈ ల్యాబ్ లు ఉపయోగ పడుతాయని అన్నారు. 200 పడకల ఆస్పత్రి ఆవరణలోనే మెడికల్ కాలేజీ వస్తుందని హరీశ్ రావ్ అన్నారు. వారం రోజుల్లో డయాలసిస్…