తెలంగాణలో అధికారం కోసం బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే అధికారమే లక్ష్యంగా, ప్రజల్లోకి వెళ్లేలా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నారు. జనాలతో మమేకం అవుతున్నారు. దీంతో పాటు ప్రజా సంగ్రామ యాత్రకు జాతీయ నాయకులను కూడా రప్పిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ నెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్…
జులైలో జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నిక కోసం అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి ఐక్య పోరాటం చేయవచ్చనే అందోళన బీజేపీలో ఉంది. ఈ నేపథ్యంలో, అధికార పార్టీ ముందుగానే అప్రమత్తమై కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలపై దృష్టి సారించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు గల ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఇందులో ప్రతిపక్షాల ఉమ్మడి బలం బీజేపీ, దాని మిత్రపక్షాల కంటే కాస్త ఎక్కువగా ఉంది. కనుక,…
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-2023 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా మరో 37 చోట్ల ఇంటర్ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉండగా.. కొత్తగా ఏర్పడిన మండలాల్లో మరో 26 మంజూరు చేయాలని రాష్ట్ర…
రాజద్రోహం చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్ట్ స్టే విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజద్రోహ చట్టం నిబంధనలను కేంద్ర హోం శాఖ పున: సమీక్షించే వరకు రాజద్రోహం కింద కేసులు నమోదు చేయవద్దని కేంద్ర , రాష్ట్రాలను ఆదేశించింది. రాజద్రోహ చట్టం 124ఏ కింద ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈ కేసు కింద శిక్ష అనుభవిస్తున్న వారు బెయిల్…
వరుస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి విజయం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణ పరాజయాలను మూటకట్టుకుంది. చివరకు తాము అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా అంతర్గత కలహాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పింది. ఇక ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పెర్ఫామెన్స్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అంత ఘోరంగా పార్టీ అపజయాలను…
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తెలంగాణ పోలీసు వ్యవస్థపై, సీఎం కేసీఆర్ పై సంచళన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా.. మూలాలు మాత్రం తెలంగాణలో..కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఉగ్రవాద ఏమూల జరుగుతున్నా.. దాని మూలాలు మాత్రం తెలంగాణలో ఎందుకు ఉంటున్నాయో.. దీనికి తెలంగాణ పోలీస్ యంత్రాంగం సమాధానం చెప్పాలని నిలదీశారు. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారు తెలంగాణలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నో కేసులతో సంబందం ఉన్న MIM నేతలకు క్లీన్…
దేశవ్యాప్తంగా లౌడ్ స్పీకర్ల వివాదం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయంగా రచ్చ జరుగుతోంది. మసీదుల్లో, ఇతర ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా చర్చనీయాంశం అయింది. తాజాగా లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6…
మహబూబాబాద్‌లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే మెడికల్ కళాశాలను, నూతన హాస్పిటల్‌కు నిర్మాణం చేపట్టడం జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెల్లడించారు. మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే.. హరీష్‌రావు వెంట మంత్రి ఎర్రబెల్లి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాళేశ్వరం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం…
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట సత్తా చాటిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ అని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాకుంటే మహబూబాబాద్ జిల్లాయే లేదని, మెడికల్…
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. మాజీ ఎంపీ. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానంతో 2013లో గులాబీ కండువా కప్పుకొన్న విశ్వేశ్వర్‌రెడ్డి.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నాటకీయ పరిణామాల మధ్య టీఆర్ఎస్కు రాజీనామ చేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగినా 13వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోనూ ఉక్కపోత ఫీలయ్యారు విశ్వేశ్వర్‌రెడ్డి. 2021 మార్చిలో హస్తంపార్టీకి…