హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో దారుణ హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. సీఎం కేసీఆర్ మానవత్వం లేని మూర్ఖుడు.. నాగరాజును కిరాతకంగా చంపేసినా స్పందించక పోవడం దారుణం అన్నారు. బాధిత కుటుంబానికి ఇల్లు, ఉద్యోగం తోపాటు 8.5 లక్షలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమీషన్ ఆదేశించినా.. ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్న…
డబుల్ బెడ్రూం లబ్దిదారులకు శుభవార్త చెప్పారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా మొగ్దుంపూర్ లో డబుల్ బెడ్ రూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… డబుల్ బెడ్రూం ఇండ్లు దశల వారీగా ఇస్తామని.. ఎవరికీ అన్యాయం జరుగనివ్వబోమని ప్రకటించారు. ఇది కంటీన్యూయస్ ప్రాసెస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు కూడా మనము ఇక్కడే బతికి ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయిగా…
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాల పేరుతో బీజేపీ బుల్డోజర్లతో ప్రజల ఇండ్లు, దుకాణాలను కూల్చివేయడం సరైంది కాదని, స్వాతంత్ర్యం తరువాత ఇదే దేశంలో అతి పెద్ద విధ్వంసమని ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో కాషాయ పార్టీ బుల్డోజర్లు ఇదే తరహాలో తిరిగితే నగరంలో 63 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతారని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆక్రమణలను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)…
ఏపీలో బీజేపీ-వైసీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. ముస్లింలను రెచ్చగొడుతూ బీజేపీ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలకి స్పీకర్ అతనిని సస్పెండ్ చేయాలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. దీనిపై గవర్నర్ కి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాం అన్నారు. పోలవరం,ఉత్తరాంధ్ర జిలాల్లో ప్రాజెక్టులు కడుతున్నాము. బీజేపీకి మాత్రమే వైసీపీ ప్రభుత్వం భయపడుతుంది. జెఎన్టీయుకె ఆస్థులు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. పోలీసులు బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు. శ్రీశైలంలో ఎమ్మెల్యే చక్రపాణి అనుచరుడు…
తండ్రి కొడుకుల వల్ల పురపాలక శాఖ భ్రష్టు పట్టి పోయిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్ మండి పడ్డారు. అమిత్ షా సభ తర్వాత TRS నేతలకు నిద్ర పట్టడం లేదు, తినడం లేదని ఎద్దేవ చేశారు. బంగారు గిన్నెలో జీవితం ప్రారంభించిన కేటీఆర్ కి పేద ప్రజల కష్టాలు తెలుస్తాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత అవినీతి, అసమర్థ , బాధ్యత రహిత్య మంత్రి కేటీఆర్ అంటూ మండి పడ్డారు. ఏసీబీ ట్రాప్…
సంగారెడ్డి జిల్లా ఆందోల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ.. మాజీ మంత్రి.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న బాబూమోహన్ ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. వేర్వేరు పార్టీలకు చెందిన ఈ ఇద్దరు నాయకులు.. పుల్కల్ మండలంలోని పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనలకు వచ్చారు. కలిసి రాకపోయినా.. ఇక్కడకి వచ్చాక కలిసి ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నారు. పార్టీల మధ్య ఉన్న వైరం నేతల మధ్య కనిపించకపోయినా..…
కొంతకాలంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటోంది తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విధాన పరంగా పలు అంశాలపై కేంద్రాన్ని గట్టిగానే కార్నర్ చేస్తోంది రాష్ట్రంలోని అధికారపక్షం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రోడ్డోక్కి కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రైతుల కోసం స్వయంగా సీఎం కేసీఆర్ నిరసన చేపట్టారు. తెలంగాణలో పొటికల్ టెంపరేచర్ పెరిగిన తర్వాత రెండు పార్టీల మధ్య సెగలు మరింతగా రాజుకుంటున్నాయి. ఇప్పుడు రెండు…
ఇటీవల బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడడంతో.. కారణం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంటూ.. బీజేపీ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. తాజాగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. జిల్లా తాను చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక, కాళ్లలో కట్టెలు పెట్టేందుకు కొన్ని పార్టీల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక్కడి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇస్తున్న తప్పుడు సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన కొందరు దరిద్రులు కట్టుకథలు, ఆరోపణలు మొదలుపెట్టారని అగ్రహం వ్యక్తం…
దేశంలో ప్రతి సంవత్సరం అందరం మాతృ దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటామో.. అలాగే భార్య దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని అన్నారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భార్య దినోత్సం గురించి ప్రస్తావిస్తూ.. భార్యా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఆయన వెల్లడించారు. తల్లి జన్మనిస్తున్న కారణంగా మాతృ దినోత్సవాన్ని…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రకు శనివారం ముగింపు సభ నిర్వహించారు. అయితే ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి హజరై ప్రసంగించారు. ఇదిలా ఉంటే.. నేడు ఇటీవల పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వెళ్తుండగా మార్గ మధ్యలో బండి సంజయ్ కు ప్రధానమంత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. శభాష్ బండి సంజయ్.. కష్టపడి పని చేస్తున్నారని అభినందించారు…