ప్రధాని మోడీ రేపు హైదాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20 సంవత్సరాల స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. అయితే ఇప్పటికే.. తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంతేకాకుండా భద్రత కారణాల దృష్ట్యా ఎస్పీజీ ఆధీనంలోకి ఐఎస్‌బీ వెళ్లిపోయింది. అయితే తాజాగా ప్రధాని మోడీకి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ప్రధాని రేపు మధ్యాహ్నం 1 .30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 1 .45 వరకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ లో బీజేపీ నేతలతో మీటింగ్. అనంతరం 1 .50 కి హెలికాప్టర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెలిప్యాడ్ కు మోదీ చేరుకుంటారు. హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన 2 కి.మీ. ఐఎస్‌బీకి ప్రయాణం. మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవంలో మోడీ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేటకు మోడీ చేరుకుంటారు. 4 .15 కు బేగం పేట్ నుండి చెన్నై కి మోడీ బయలు దేరుతారు.
modi hyd tour schedule