Undavalli: పొత్తులపై ఉండవల్లి సంచలనం.. వారు విడిపోయినా ఆశ్చర్యంలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. గత కొంతకాలంగా ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై మాత్రం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అంతా ఏకం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కాగా.. టీడీపీ నేతలు కూడా పొత్తులకు సై అనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ-బీజేపీ మధ్య మైత్రి ఉండగా.. ఎన్నికలలోపు ఏదైనా జరగొచ్చు అనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్.
Read Also: Undavalli: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు.. పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు..!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు మాటలు బట్టి టీడీపీ-జనసేన మధ్య పొత్తులు ఉంటాయని భావిస్తున్నానని తెలిపారు ఉండవల్లి.. అయితే, ఏపీలో సీఎం జగన్ కొనసాగాలని బీజేపీ భావిస్తే పొత్తులుండవని జోస్యం చెప్పారు.. ఏపీలో రాజకీయం ఎలా ఉన్నా మనకేంటనే భావనలో బీజేపీ ఉంటే పొత్తులుంటాయన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉండదనే భావిస్తున్నానని వెల్లడించారు. ఇక, జనసేన-బీజేపీలు విడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని బాంబ్ పేల్చారు ఉండవల్లి.. మరి ఏపీలో ఎన్నికల వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి..? ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు..? అనే ప్రశ్నకు సమాధానం కోసం మరింత కాలం వేచిచూడాల్సిందేనేమో.
తాజావార్తలు
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!