BJP Worker Killed in karnataka: కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీజేపీ యువమోర్చా కార్యకర్త దారుణహత్యతో అట్టుడికిపోతోంది. దక్షిణ కన్నడ జిల్లాలో పోలీసులు బందోబస్త్ ను పెంచారు. మంగళవారం సాయంత్రం జిల్లాలోని బెల్లారే ప్రాంతంలో బీజేపీ యువ మోర్చా ఆఫీస్ బేరర్ ప్రవీణ్ నెట్టారును దుండగులు దారుణంగా హత్య చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సినీ నటుడు మోహన్‌బాబు భేటీ అయ్యారు.. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించినట్టు సమాచారం.. దశాబ్ధ కాలంగా చంద్రబాబుతో మోహన్‌బాబుకు గ్యాప్ ఉంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ.. ఓ రేంజ్లో ఫైర్ అయ్యేవారు మోహన్‌బాబు.. ఆయన పేరు ఎత్తితేనే భగ్గుమనేవారు.. కానీ, తాజా సమావేశం ఆసక్తికరంగా…
ఈటెలకు టచ్ లో ఉన్న వారి పేర్లు బయట పెట్టే దమ్మందా..? అంటూ.. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సవాల్ విసిరారు. ఈటెల ది వ్యాపార నైజం, ఆయనకు ఏ సిద్ధాంతం లేదని విమర్శించారు. గజ దొంగ పార్టీలో ఈటెల చేరి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. ఈటెలకు బీజేపీలో ఏముందని నాయకులు ఆయనతో టచ్ లో ఉంటారని ప్రశ్నించారు. మోడీ రెండు నెలలు హైద్రాబాద్ లో ఉన్నా.. ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడు అంటూ చురకలంటించారు.…
తెలంగాణలో ప్రస్తుతం ఒరిజినల్ కాంగ్రెస్ లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డ కోమటిరెడ్డి.. తెలంగాణ ఉద్యమం చేసిన వారికి కాంగ్రెస్‌లో ప్రయారిటీ లేదని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ హాట్ కామెంట్లు చేశారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ మరోసారి చర్చ సాగుతోంది.. గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తిన ఆయన.. బీజేపీపై ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు.. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కోగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని.. అది బీజేపీతోనే సాధ్యం అవుతుందని పలు సందర్భాల్లో ప్రకటించారు.. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన రాజగోపాల్‌రెడ్డి.. ఇక, బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగారు సీఎల్పీ నేత మల్లు భట్టి…
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ఈటెల రాజేందర్. మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ జెండా ఎగురవేసి జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు ఈటల కు ఖడ్గం బహూకరించారు. పలువురికి ఈటల రాజేందర్ కాషాయ జెండా కప్పి బీజేపీ లోకి స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ ప్రజనికానికి శుభదినమన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఒక…