బండి సంజయ్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. దీనిపై ఎన్టీవీకి వివరణ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసలు బండి సంజయ్ ఏమన్నారో నాకు తెలియదని అన్నారు. బండి సంజయ్ తో తాను ఎప్పుడూ టచ్ లో లేనని స్పష్టం చేసారు. ప్రధాని మోడీని కలిసిన ఉద్దేశ్యం గురించి కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. పార్టీ మార్పుపై కోమటిరెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించాక జరిగే పరిణామల్ని బట్టి తన నిర్ణయం ఉంటుందని తెలిపారు. తన నియోజకవర్గంలో జాతీయ రహదారుల అంశంతో పాటు బొగ్గు గనుల టెండర్ల విషయంలో చోటు చేసుకొన్న అవినీతి విషయంలో ప్రధానిని కలిసినట్టుగా చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని చెప్పారు. కాగా.. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయలేదన్నారు. ఈ రాజీనామా స్పీకర్ ఆమోదించిన తర్వాత ఏం చేయాలో తాను తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయలేదన్నారు. ఇప్పుడే ఈ ప్రశ్న వేయడం తప్పన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ఏం చేయాలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
read also: Mithilesh Chaturvedi: బాలీవుడ్ లో విషాదం!
యాదాద్రి జిల్లా గొల్లగూడ నుండి మూడో విడత 4వరోజు బండి సంజయ్ పాదయాత్ర సందర్బంగా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మాతో టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం చేసారు. బీజేపీకి, మోడీకి అనుకూలంగా కోమటిరెడ్డి మాట్లాడారని అన్నారు. మునుగోడులో గెలుపు మాదే అని, మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లోకి వచ్చారని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. క్యాసినో డ్రగ్స్ కేసులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని విమర్శించారు. మంత్రుల తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే జోకర్లలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చికోటి ప్రవీణ్ వెనుక ఉన్నది.. కెసిఆర్ కుటుంబ సభ్యులే అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..
Ram Gopal Varma: టాలీవుడ్ అసలు శత్రువు రాజమౌళినే!