ఏపీలో అధికారమే పరమావధిగా బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. బీజేపీ తీరుపై అటు అధికార వైసీపీ, విపక్షంలో వామపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా సీపీఐ నేత రామకృష్ణ తీవ్రవ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రాలు రెండు లక్షల మంది పోలవరం...
జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారులో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. భారీ నగదుతో పోలీసులకు పట్టుబడిన ఆ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఆ ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో రాజకీయ వేడి ఎక్కువగా ఉందని, ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా సమస్యల గురించి ఏ పార్టీ మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిన పేరు ఏదైనా ఉంది అంటే..! అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదే.. ఓవైపు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని అధికార టీఆర్ఎస్ పార్టీ చెబుతున్నా.. ముందస్తు ముంచుకొస్తోంది.. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అనే తరహాలో.. తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్‌తో ఇతర పార్టీల నేతలను ఆహ్వానించే పనిలో పడిపోయారు.. ఇప్పటికే పలువురు నేతలు.. అటు బీజేపీలో.. ఇటు కాంగ్రెస్‌లో చేరుతూనే ఉన్నారు.. ఈ…
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్నిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేత, లోక్ సభ లో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ మాటలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతా రావు స్పందించారు. ఒకరు తప్పు చేస్తే వేరొకరు క్షమాపనలు చెప్పాలా అంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. సోనియా గాంధీ…
Another youth killed in karnataka: కర్ణాటక వరస హత్యలతో అట్టుడుకుతోంది. వరసగా రోజుల వ్యవధిలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు యువకులను దుండగులు దారుణంగా హత్య చేశారు. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే బెల్లారే ప్రాంతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టార్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది.