తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది.. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధం కాగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ.. తమ సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాయి.. అయితే.. మునుగోడులో విజయం మాదేఅంటుంది భారతీయ జనతా పార్టీ.. గత ఉప ఎన్నికల్లో గెలిచినట్టుగానే.. మునుగోడులోనూ బీజేపీ జెండా పాతేస్తాం అంటున్నారు.. ఇక, మునుగోడులో సర్వేలన్నీ…
2024లో బీజేపీ ముక్త్ భారత్ కావాలి.. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.. అందులో దేశ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన.. కలెక్టరేట్ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.. ఆ తర్వాత టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయానికీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. 60…
తెలంగాణతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టే నంటూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై ఇప్పుడు భిన్నవాదనలు తెరపైకి వస్తున్నాయి.. విలీనం అని ఓ వైపు.. విమోచనం అని మరోవైపు.. తమ వాదనలు వినిపిస్తున్నారు రాజకీయ నేతలు.. అయితే, వారి ప్రయోజనాల కోసం సాయుధ పోరాటాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. రైతాంగ సాయుధ పోరాటాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని కమ్యూనిస్టు నేతలు మండిపడుతున్నారు.. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి.. రైతు…
జార్ఖండ్‌లో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సర్కారు నెగ్గింది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వెంటనే సభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని హేమంత్ సోరెన్ ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై కాసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్‌లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి.
మోడీ హయంలో యువతకు భవిష్యత్తు లేదని, మోడీని నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ యే అంటూ Cpi జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా మండిపడ్డారు. ఈ దేశానికి సోషలిజం ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. కొన్ని ఫార్మా కంపెనీలు కరోనా సమయంలో దేశ ప్రజలను లూటీ చేశాయని తెలిపారు. కమ్యూనిస్టుల ఐక్యం అయితే ప్రజలు అధికారం వైపు తీసుకు వెళ్తారని పేర్కొన్నారు. మోడీ హయంలో యువతకు భవిష్యత్తు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు పేదలుగానే ఉంటున్నారన్నారు. మోడీని నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ పర్యటన మత సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నమేనని జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్(లలన్ సింగ్) ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 40 పార్లమెంటు స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కమ్యూనిస్టుల త్యాగాలు చాలా గొప్పవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆర్ఎస్ఎస్ బ్రిటీశ్ వాళ్లకు తొత్తులుగా వ్యవహారం చేసిందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేరడం లేదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి కేసీఆర్ కుటుంబసభ్యులకు మాత్రమే పరిమితమైందని ఆరోపించారు.
Samantha: సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతుండగా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.