అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రం పై ఫైర్ అయ్యారు. మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. ఎక్కడైన చర్చకు రెడీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంట్ కష్టాలు చూశామన్నారు. అందరం ఇబ్బంది పడ్డాం అన్నారు. ఇది మహాత్మగాంధీ పుట్టిన నేలనేనా? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ లోనే తెలంగాణ గొంతు నొక్కిందని మండిపడ్డారు. మన మండలాలు.. సీలేరు ప్రాజెక్టు గుంజుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా గాంధీ తెలంగాణ బిల్లు ఫైనల్ స్టేజ్ కి వచ్చే సరికి తెలంగాణకు కేటాయింపులో సీలేరు ఇచ్చారు మనకని గుర్తు చేశారు. సింగరేణి కూడా మనకే కేటాయించిందని అన్నారు. మోడీ.. మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని అని మండిపడ్డారు. మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. తెలంగాణ బంద్ కి పిలుపు నిచ్చింది నేనే అని సీఎం కేసీఆర్ అన్నారు. రఘునందన్ రావు… సత్యదూరం మాటలు చెప్తున్నారు.
సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కలారస్తుంది బీజేపీ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం బాధ్యత.. ఇది రాచరిక కాదు.. పవర్..ఉమ్మడి జాబితా లోనిది అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాలను అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా చేస్తుంది కేంద్రం అని విమర్శించారు. అధికార పార్టీ సభ్యులు ఎక్కువ ఉండి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా చేసింది బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెజిట్ లో, లేదు అని అబద్దం చెప్తున్నారు రఘునందన్ రావు. ఏపీలో మీటర్లు పెడితే కాలపెట్టారు. బీజేపీ పెట్టడం లేదు అంటున్నారు.
బీజేపీ కి…కేంద్రంకి మద్య ఏదో గ్యాప్ ఉన్నట్టుంది అని ఎద్దేవ చేశారు. బీజేపీ చెప్పే దానికి కేంద్రం చేస్ దానికి తేడా ఉందని సీఎం మండిపడ్డారు. సంస్కరణ అనే అందమైన ముసుగు తొడిగి దోచుకుంటుంది కేంద్రం అన్నారు. అమ్మేసుడే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Rtc అమ్మేయండి అన్నది, ఎవరు ముందు అమ్మితే వాళ్లకు వెయ్యి కోట్ల నజరానా అంటా.. వడ్లు వెయ్యండి కొంటం అన్నారు. తీరా వేసిన తర్వత కొంటాం అన్నోడు పత్తా లేకుండా పోయారన్నారు. బీజేపీ ఎంపీలు, మంత్రులు నిష్క్రియాపర్వంగా మారిపోయారని మండిపడ్డారు. మేమంతా ధర్నా చేస్తే… కేంద్ర మంత్రి అవమానం చేస్తున్నారన్నారు. తెలివితక్కువ కేంద్ర ప్రభుత్వం అని మండిపడ్డారు. రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతుందని అన్నారు. ఎక్కడ అయిన మేము చర్చకు రెడీ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యము ఉండవద్దట. కొందరు బీజేపీ నేతలు మాట్లాడతారు.ఎక్కడి నుంచి ఈ దరిద్రులు దాపురించారని తీవ్రంగా విమర్శించారు.
మరగుజ్జులు ఎక్కడి నుండి వచ్చారన్నారు. మహాత్ముడు పుట్టిన నేల మీద కూల్చేస్తాం ..కల్చేస్తం అనే మరగుజ్జులు పుట్టారు. వేరే పార్టీలే లేకుండా చేస్తాం అంటున్నారు చెయ్ చూద్దాం అని అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరారు. దేశంలో ఏక పార్టీ ఉంటది అంటారు.. అన్ని పార్టీలను బ్యాన్ చేయండి ఎవరో ఉండేదో తేలుతుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీని ఉండనియమని కేంద్ర హోంమంత్రి మాట్లాడతారు. కేంద్రంను పాలిస్తున్న పార్టీకి ఏనాడు 50 శాతం ఓట్లు రాలేదని స్పష్టం చేశారు. 36 శాతం ఓట్లు చూసుకుని మురిసి పోతున్నారు. హిట్లర్.. ముస్సోలి లాంటి వాళ్ళే పోయారు.. కాలం సమాధానం చెప్తుందన్నారు. అధికారం నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ మండి పడ్డారు.
PM Narendra Modi: వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022ను ప్రారంభించిన ప్రధాని మోడీ