Heavy security for MLA Rajasingh in jail: ఓ మతాన్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ హైదరాబాద్ ప్రదర్శన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. హిందూ దేవతలను అవమానపరిచిన మునావర్ ఫరూఖీ ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.
Harish Rao challenges Nirmala Sitharaman: రేషన్ షాపు దగ్గర ప్రధాని ఫోటో పెట్టాలని అంటున్నారు.ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రిహరీష్ రావ్ మండిపడ్డారు. బియ్యం అంతా వాళ్లే ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిగజారేలా మాట్లాడొద్దని మండిపడ్డారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని గుర్తు చేశారు. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది తక్కువ అని స్పష్టం చేశారు.…
త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ తో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేదలను మా ప్రభుత్వం కాపాడుకుంటుందని హరీష్ రావ్ అన్నారు. దేశంలో ఎక్కడ కూడా 2016 రూపాయల పెన్షన్లు ఇస్తలేరని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఉచితాలు బీజేపీ బంద్ చేయమంటుందని, ఏది ఉచితం ఏది అనుచితం…
మునుగోడు బరిలో టీఆర్ఎస్ దూకుడు సిద్దమైంది. మొన్న సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు పలుకగా.. నేడు సీపీఎం మద్దతు ప్రకటించడంపై చర్చనీయాంశంగా మారింది. బీజేపీని ఓడించేందుకే టీఆర్ ఎస్‌కు మద్దతు తెలుపు తున్నట్లు అటు సీపీఐ ఇటు సీపీఎం పార్టీలు ప్రకటించడంతో.. సర్వత్రా ఉత్కంఠంగా మారింది. తాజాగా బీజేపీలో వెంకట్‌రెడ్డి రాజగోపాల్ రెడ్డి కషాయి కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 21 అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ లో చేరారు. కాంగ్రెస్ లో ఇన్ని…
శ్రీశైల మల్లన్న దర్శనానికి రైల్వే మంత్రిని కూడా తీసుకొస్తానని, త్వరలోనే శ్రీశైలానికి అమిత్ షా వస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శ్రీశైలంలో ప్రసాదం స్కీం పనులను పరిశీలించారు. ప్రసాదం స్కీమ్ పనులన్నీ పూర్తి వచ్చే నెలలో నేను ఏపీ మంత్రి ఎమ్మెల్యేతో ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. శ్రీశైలానికి రైల్వే మార్గానికి రైల్వే మంత్రితో మాట్లాడతా అన్నారు. గోశాలలోని 1300 గోవులు వున్నా కొన్ని గోవులు బలహీనంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోవుల…
సీఎం సర్కార్‌కు పేదల ప్రాణాల కంటే పేరు ప్రఖ్యాతలే ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు మహిళల మృతి చెందడానికి కేసీఆర్ సర్కార్ మూర్ఖత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నేడు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ పరామర్శించారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, మంత్రి హరీష్ రావు తీరుపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బాధితులను పరామర్శించకుండా బీహార్…
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్‌ను సీబీఐ అధికారులు ఇవాళ ఓపెన్ చేశారు. ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సిసోడియాకు లాకర్ ఉండగా.. దర్యాప్తుకు సంబంధించి ఆ లాకర్‌ను సీబీఐ సోదా చేసింది.