సినీనటుడు కృష్ణంరాజు ఆకస్మిక మృతిపట్ల మాజీ గవర్నర్ , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు చెన్నమనేని విద్యాసాగర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకులు శ్రీ యు వి కృష్ణంరాజు నేడు అనారోగ్యంతో మరణించిన వార్త తీవ్రంగా బాధించింది.వారు మంచి మిత్రులు వారు ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్న నాతో మిత్రుత్వాన్ని వదులుకోలేదు. వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో చేరి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు . వాజ్పేయి గారి ప్రభుత్వంలో వివిధ శాఖలలో పనిచేసి ప్రజలకు సేవలందించారు.
Read Also:
Krishnam Raju: చిత్రసీమలో కృష్ణంరాజు బంధాలు అనుబంధాలు
తెలంగాణ విమోచన దినోత్సవం(17 సెప్టెంబర్) సందర్భంగా నిజాం కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు ప్రజలను ఉత్సాహపరిచారు. అనేక చిత్రాలలో నటించి తెలుగు ప్రజలను సినిమా ద్వారా చైతన్య పరిచిన వ్యక్తి. వారి మరణం బిజెపి పార్టీ కి, తెలుగు ప్రజలకు, సినిమా కళాకారులకు తీరని లోటు. శ్రీ కృష్ణంరాజు మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అన్నారు విద్యాసాగర్ రావు.