మందు తాగేవాళ్లతోనే ఉండను.. అలాంటిది మందు వ్యాపారం చేస్తానా..? అంటూ ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు సంబంధాలున్నాయంటూ రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఫైర్ అయ్యారు… అన్నదమ్ములు చెరో పార్టీలో ఉండొచ్చు కానీ, తన బంధువు ఎవరో వ్యాపారం చేస్తే… దాంతో తనకేంటి సంబంధం అన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో ప్రభుత్వం బీజేపీదే కాబట్టి.. దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. లిక్కర్ స్కాం పై బీజేపీ బుద్దిలేని ప్రచారం చేస్తోందని మండిపడ్డ ఆయన.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు పదేపదే ఈ అంశంపై మాట్లాడుతున్నారు.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏ విచారణకైనా నేను సిద్ధమే అని సవాల్ విసిరారు..
Read Also: YS Sharmila: మరోసారి నిరంజన్‌రెడ్డిపై వైఎస్ షర్మిల ఫైర్.. ఈయన కన్నీళ్ల నిరంజన్ రెడ్డి..!
పరిచయాలు ఉండటం నేరంలో భాగం కాదు.. విచారణకు అదేషించండి అని వ్యాఖ్యానించారు రేవంత్‌రెడ్డి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఇల్లు ఇప్పటి వరకు సోదా చేయలేదన్న ఆయన.. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే.. లిక్కర్ స్కాంపై కవిత ఇంట్లో సొద చేయాలని సవాల్ చేశారు.. కేసీఆర్ ఇంట్లో కూడా సోదాలు చేయాలని డిమాండ్ చేశారు.. టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ నాయకులను సంతోష పెట్టే పనిలో ఉన్నారు.. తెలంగాణలో దోచుకోవడానికి ఏం లేదు కాబట్టి బయటకు పోతా అంటున్నారు అని ఎద్దేవా చేశారు.. కూని ఆపరేషన్ కూడా సరిగా చేయించ లేని ప్రభుత్వం ఇది.. కేసీఆర్ అల్లుడు స్వాతిముత్యం ఆరోగ్య శాఖ చేస్తున్నారు.. కొడుకు చూసే శాఖలో.. హైదరాబాద్ లో వర్షం వస్తే పడవలు వేసుకుని పోవాల్సి వస్తుంది అని ఎద్దేవా చేశారు.. ఇక, కేసీఆర్ కాంగ్రెస్ తో ఉన్న వాళ్ళనే కలుస్తున్నారు.. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని కలిశారా? అని ప్రశ్నించారు.. వైఎస్ జగన్‌ను ఎందుకు కలడంలేదు.. బీజేపీతో ఉన్న వాళ్ళను కలవడు… దానిని బలహీన పరచడు అని ఆరోపించారు రేవంత్‌రెడ్డి.