వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై వారం రోజులవుతున్నా, ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నిమజ్జన ఏర్పాట్లు చేయలేదు. కనీసం ఏర్పాట్లపై చర్చ కూడా జరపలేదు. ఏమైనా అంటే కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు హిందూ పండుగలంటేనే షరతులు గుర్తుకొస్తాయని విమర్శించారు. ఇతర వర్గాల పండుగల విషయంలో ఇవేమీ పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మధ్య గందరగోళం సృష్టించి ఆ పండుగలకు ప్రాధాన్యత లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగా…
రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. స్పీకర్ పైనే చర్యలు తీసుకోవాలని, సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా నియమితులైన పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లతోపాటు జిల్లా ఇంఛార్జ్ లతో బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్…
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… స్పీకర్పై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మండిపడ్డ ఆయన.. సీనియర్ సభ్యుడిని అని చెప్పుకుంటూ… సభాపతిని మరమనిషి అని కించపరుస్తూ మాట్లాడారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సభ ఎన్ని రోజులు అనేది బీఏసీలో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం.. కానీ, సీఎం కేసిఆర్ చెప్పినట్లు స్పీకర్…
తెలంగాణ అభివృద్ధి విషయంలో విమర్శలు చేసేవారికి కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని అంటున్నారు.. మీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నీళ్లు విడుదల చేయలేదా…? అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి.. రైతు ఆత్మహత్యలు తగ్గాయి.. దేశంలో 24 గంటల కరెంట్ ఎక్కడైనా ఉందా…? ఇది తెలంగాణ సాధించిన ప్రగతి కాదా…? అని ప్రశ్నించారు.. లక్ష కోట్లతో కాళేశ్వరం…
ఎందుకు బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి స్పీకర్ పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. అయితే.. రాజాసింగ్ ఒక్కరున్నప్పుడు బీఏసీ సమావేశానికి పిలిచారని.. ఇవాళ బీజేపీకి ముగ్గురు సభ్యులున్నప్పుడు ఎందుకు పిలవడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశానికి పిలుస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అంతమందిని ఈ అసెంబ్లీ పదవీ కాలంలోపే తెచ్చుకుంటామని రఘునందన్ రావు ఎద్దేవ చేశారు. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి మూడు రోజుల్లో సభను…
బీఏసీని సంప్రదించకుండా 3 రోజులకె పరిమితం చేశారని, ఇది కేసీఆర్ అహంకారనికి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం, అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రజానీకం 2 వ సారి అధికారం కట్టబెట్టిన తరువాత శాసనసభ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని అన్నారు. శాసన సభ్యులను గడ్డి పోచల్లగా అవమానిస్తున్నారని ఆగ్రహం…
Bandisanjay is Serious about CM KCR: వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థకు గురైన బాలికలకు వెంటనే సరైన చికిత్స అందించాలని. అస్వస్థత అయిన బాలికలను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బల్లి పడ్డ…
మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి… రేపు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్నాయి… మొదటి రోజు మృతిచెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాక ఎల్లుండికి సభ వాయిదా వేయనున్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి… ఇక, రేపు జరగనున్న బీఏసీ సమావేశంలో.. సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.. ఇక, సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఒకేసారి శాసన సభ…