దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తన హవా కొనసాగించింది. మొత్తం 7స్థానాల్లో ఎన్నికలు జరగగా.. బీజేపీ 3 సీట్లను కైవసం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోకరనాథ్, హర్యానాలోని ఆదంపూర్‌లో బీజేపీ విజయం సాధించగా, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో ఆధిక్యంలో ఉంది.
తెలంగాణలో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో వచ్చిన ఈ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. అధికార టీఆర్ఎస్ పార్టీ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని రంగంలోకి దింపితే..
మునుగోడులో 50 వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కేఏ పాల్.. ఫలితాల్లో మాత్రం ప్రభావం చూపలేక పోతున్నారు. 6 రౌండ్లు పూర్తయ్యే సరికి 500 ఓట్లు కూడా రాలేదు.
BJP Promises Uniform Civil Code In Himachal If Voted Back To Power: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఆదివారం రోజున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ మేనిఫేస్టోను విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతామనే విషయాలను మేనిఫేస్టోలో వివరించారు. 11 హామీలను ఇచ్చారు. ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలోకి…
మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు బీజేపీ రాజ్య సభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అధికారి ఒక్కో విధంగా చెబుతూ ఫలితాలపై కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో జాస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అధికార, ప్రతిపక్షాలు.. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాల్ చేసి ఆగ్రహం వ్యక్తం చేయడంపై టీఆర్ఎస్ మండిపడుతోంది.. బీజేపీ నేతల తీరును తప్పుబడుతూనే.. అసలు ఫలితాల వెల్లడిలో ఎందుకు ఈ జాప్యం..? ముందు ఇచ్చే లీక్‌లు ఏంటి.. ఆ తర్వాత వచ్చే ఫలితాలు మరోలా ఉండడమేంటి? అని మంత్రి జగదీష్‌రెడ్డి అసహనం…
BJP is leading in four seats in the by-elections: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మునుగోడులో టీఆర్ఎస్ పార్టీతో నువ్వానేనా అన్న రీతిలో పోరాడుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.