ప్రధాని నరేంద్రమోడీ నేడు, రేపు విశాఖపట్నంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో మోడీ పలువురు రాజకీయ ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతో బీజేపీ ఏపీ కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధానితో ఏపీ బీజేపీ భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే.. ఏపీలో జరుగుతోన్న పరిణామాలు.. రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో మోడీతో చర్చించనున్నారు. ప్రభుత్వ పనితీరు, రాజధాని, జనసేనతో పొత్తు వంటి అంశాలను ఏపీ బీజేపీ నేతలు ప్రస్తావించనున్నారు. అంతేకాకుండా.. ప్రతిపక్షంగా తాము చేసిన కార్యక్రమాలను ప్రధానికి బీజేపీ నేతలు వివరించనున్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాని పర్యటన కోసం విశాఖలో కట్టుదట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నిరసనలు, ధర్నాలపై నిషేధం విధించారు పోలీసులు. ప్రధాని, సీఎం, ఇతర ముఖ్యులు రాకపోకలు కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.
Also Read :Holiday Cancelled: విద్యార్థులు, ఉద్యోగులకు అలర్ట్.. రెండో శనివారం సెలవు రద్దు.. ఎందుకంటే..?
11, 12తేదీల్లో జరిగే రెండు కిలోమీటర్ల శోభాయాత్ర, భారీ బహిరంగ సభ నిర్వహణ విధుల్లో 6,700మంది నిమగ్నమయ్యారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు సీపీ పర్యవేక్షిస్తున్నారు. భావోద్వేగ అంశాలతో నిరసనలతో ప్రధాని పర్యటనకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఇప్పటికే సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. అయితే.. ఈ రోజు సాయంత్రం విశాఖకు చేరుకోనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ ఘనంగా స్వాగతం పలుకనున్నారు. రేపు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరుగనున్న ప్రధాని మోడీ బహిరంగ సభకు సుమారు 3 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు సైతం పోలసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.