Gujarat Elections: రవీంద్ర జడేజా భార్యకు… మోర్బీ ఘటనలో ప్రజల్ని కాపాడిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja Thanks PM After Wife Picked As Gujarat BJP Candidate: గుజరాత్ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 182 స్థానాలకు గానూ డిసెంబర్ 1, డిసెంబర్ 5వ తేదీన రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే గురువారం 160 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. దీంట్లో భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా పేరు కూడా ఉంది. దీంతో తమకు అవకాశం కల్పించినందుకు జడేజా ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పొందినందుకు నా భార్యకు అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు. రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ స్థానానికి బీజేపీ తరుపున పోటీలో నిలబడుతోంది.
Read Also: Rishi Sunak: సెమీఫైనల్ మ్యాచ్‌పై జోమాటో ట్వీట్.. రిషి సునాక్‌కి సంకట పరిస్థితి..
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
రివాబా జడేజా మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. కాంగ్రెస్ సీనియర్ హరి సింగ్ సోలంకికి బంధువు. 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకుంది. రాజ్ పుత్ కుటుంబానికి చెందిన రివాబాకు జామ్ నగర్-సౌరాష్ట్ర ఏరియాల్లో మంచి పట్టు ఉంది. కొన్ని నెలల నుంచి ఈ ప్రాంతంలో ఆమె పర్యటనలు చేస్తూ ప్రజలకు దగ్గర అవుతోంది. ఈ జాబితాలో పాటీదార్ ఉద్యమ నాయకుడు హర్దిక్ పటేల్ విరంగమ్ సీటు నుంచి బరిలోకి దిగనున్నారు. ఘట్లోదియా అసెంబ్లీ స్థానం నుంచి సీఎం భూపేంద్ర పటేల్, మజూరా నుంచి హర్ష్ సంఘవి బరిలోకి దిగనున్నారు.

ఇదిలా ఉంటే టికెట్ల కేటాయింపులో బీజేపీ సంచలన సృష్టించింది. ఇటీవల మోర్బీ జిల్లాలో వంతెన కూలి 140కి పైగా మంది ప్రజలు మరణించారు. అయితే ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలను కాపాడి హీరోగా నిలిచిన కాంతీలాల్ అమృతియా సాహసాన్ని ప్రశంసిస్తూ బీజేపీ అతనికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించి అందర్ని ఆశ్చర్య పరిచింది. ఘటన జరిగి సమయంలో కాంతీలాల్ ధైర్యంగా నదిలోకి దూకి పలువురిని కాపాడారు. అయితే ఈ సీటు నుంచి పోటీ చేయాలనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేష్ మోర్జాకు నిరాశ మిగిలింది. దీంతో పాటు మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ డిఫ్యూటీ సీఎం నితిన్ పటేల్ ఈ సారి పోటీకి దూరంగా ఉంటున్నట్లు బీజేపీ అధిష్టానికి లేఖ రాసినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల్లో 14 మంది మహిళలు, 13 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలు ఉన్నారు.
Jai hind 🇮🇳 pic.twitter.com/JWdbV0brab
— Ravindrasinh jadeja (@imjadeja) November 10, 2022
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!