ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.. విశాఖలో రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఏపీ బీజేపీ.. మరోవైపు.. ప్రధాని మోడీ.. వైజాగ్ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. విశాఖలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 11వ తేదీ రాత్రి ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తాం.. కంచెర్లపాలెం నుండి ఓల్డ్ ఐటీఐ వరకూ కిలోమీటర్ మేర…
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యే పోటీ ఉంటుందని జోస్యం చెప్పారు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్.
ట్విట్టర్ ద్వారా కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్ పర్సన్ బీఆర్ నాయుడు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖపై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ హాల్ టికెట్ లో అభ్యర్థి ఫోటోకు బదులు రాష్ట్ర విద్యాశాఖ బ్లూ ఫిల్మ్ నటి సన్నీలియోన్ ఫోటోను ముద్రించింది.. అసెంబ్లీలో నీలి చిత్రాలను చూసే పార్టీ నుంచి ఇంకేం ఆశించగలం అని ఆయన కన్నడలో ట్వీట్ చేశారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులకు ఉండగా.. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ధర్మపాల్ ఠాకూర్ ఖండ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర సభ్యులు సోమవారం బీజేపీలో చేరారు.
మహారాష్ట్ర ముంబయిలోని అంధేరి ఈస్ట్‌కు జరిగిన ఉపఎన్నికలో ఓ విచిత్రం జరిగింది. అక్కడ ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన అభ్యర్థి రమేశ్ లట్కే భార్య రుతుజ లట్కే విజయం సాధించగా.. రెండో స్థానంలో నోటా నిలిచింది.