ప్రధాని పర్యటన కోసం విశాఖలో కట్టుదట్టమైన భద్రత ఏర్పాట్లు జరిగాయి. నిరసనలు, ధర్నాలపై నిషేధం విధించారు. ప్రధాని, సీఎం, ఇతర ముఖ్యులు రాకపోకలు కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. 11, 12తేదీల్లో జరిగే రెండు కిలోమీటర్ల శోభాయాత్ర, భారీ బహిరంగ సభ నిర్వహణ విధుల్లో 6,700మంది నిమగ్నమయ్యారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు సీపీ పర్యవేక్షిస్తున్నారు. భావోద్వేగ అంశాలతో నిరసనలతో ప్రధాని పర్యటనకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు సీపీ శ్రీకాంత్. పీఎం టూర్ భద్రత ఏర్పాట్లు పై విశాఖ సీపీ శ్రీకాంత్ పరిశీలించారు. అయితే.. ఇదిలా ఉంటే.. భారత ప్రధాని నరేంద్ర మోడీ సీఎం జగన్మోహన్ రెడ్డికి విశాఖలో ఘన స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ఈ పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి పవన్ కల్యాణ్ విశాఖలో అందుబాటులో ఉండాలని బీజేపీ నుంచి సమాచారం వచ్చింది.
Also Read : Russia-Ukraine War: రష్యా సైన్యమే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు.. 50 మంది మృతి
నేవీ అతిథిగృహం ఐఎన్‌ఎస్ చోళాలో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత పవన్‌ను విందు భేటీ కానున్నట్లు తెలస్తోంది. ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే శనివారం ఉదయం అల్పాహారం సమయంలో కలుసుకునే అవకాశం ఉంది. అయితే.. గత కొన్ని రోజులుగా ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులపై ప్రధానికి పవన్ వివరించనున్నట్లు సమాచారం.
Also Read : Moinabad Episode: రెండో రోజు కస్టడీ.. కీలకం కానున్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక
అంతేకాకుండా.. రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో సైతం కలిసి నడవలేకపోతున్నామంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. మోడీని పవన్ కల్యాణ్ 2014 ఎన్నికల్లో చివరిసారిగా కలిశారు. ఇటీవల భీమవరంకు సీతారామరాజు జయంతి వేడుకలకు మోడీ వచ్చినా.. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు పవన్ రాలేదు. అయితే.. ప్రస్తుతం ఏపీలో వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. దీంతో.. పవన్, మోడీ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.