Gujarat Assembly elections: 160 మంది బీజేపీ తొలి జాబితా.. రవీంద్ర జడేజా భార్య, హార్దిక్ పటేల్‌కు ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన అధికార భారతీయ జనతా పార్టీ.. ఇవాళ తొలి జాబితాను విడుదల చేసింది.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఇవాళ ప్రకటించింది.. కేంద్రమంత్రులు మన్సుఖ్ మాండవీయా, భూపేందర్ యాదవ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ సంయుక్త మీడియా సమావేశంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు టిక్కెట్ దక్కడంతో ఆమె జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ విరామ్‌గాం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి మజురా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.
Read Also: Lalu Prasad Yadav: నాన్నకు ప్రేమతో.. లాలూప్రసాద్ యాదవ్‌కు కూతురు కిడ్నీ దానం..
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై బుధవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరిగింది.. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తదితరులు హాజరై ఎన్నికలు, అభ్యర్థులపై చర్చించారు.. సమావేశం ముగిసిన వెంటనే, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరియు అధికార బీజేపీకి చెందిన మరో ముగ్గురు నాయకులు కొత్త వారికి అవకాశం కల్పించడానికి రాష్ట్రంలోని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. రూపానీ ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం, అతను రాజ్‌కోట్ వెస్ట్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు, గుజరాత్ ఎన్నికల కోసం బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం మంగళవారం సాయంత్రం జేపీ నడ్డా నివాసంలో జరిగింది.
గుజరాత్ దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉంది.. ఆ పార్టీ ఏడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది.. గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్ జరగనుంది. బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఎన్నికల్లో బలమైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, 182 మంది సభ్యులు గల గుజరాత్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఒకేసారి 160 మంది అభ్యర్థులతో తన మొదటి జాబితాను విడుదల చేసింది.. డిసెంబర్ 1న తొలి దశలో పోలింగ్ జరగనున్న 89 స్థానాల్లో 84 స్థానాలకు, డిసెంబర్ 5న రెండో దశలో ఎన్నికలు జరగనున్న 93 స్థానాల్లో 76 స్థానాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. జాబితాలో 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారని, పెద్ద సంఖ్యలో ప్రస్తుత శాసనసభ్యులు తొలగించబడ్డారని ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ వెల్లడించారు.. జాబితాలో 14 మంది మహిళలు, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల నుండి 13 మరియు 24 మంది సభ్యులు ఉన్నారు. 1995 నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నిరంతరాయంగా కొనసాగుతోన్న విజయ పరంపరను కొనసాగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
తాజావార్తలు
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!