నర్సంపేటలో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. వాగ్వాదాల మధ్య చివరికి షర్మిలను తను కారులో ఉండగానే పోలీసులు క్రేన్ సహాయంతో పోలీస్టేషన్ కు తరలించారు.
Prime Minister Narendra Modi reacts to Mallikarjuna Kharge's 'Ravan' comments: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ‘ రావణ్’ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. గురువారం గుజరాత్లోని కలోల్లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. రావణ్ వ్యాఖ్యలను గురించి ప్రస్తావించారు. మోదీని ఎక్కువగా దూషించాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాముడిని ఎప్పుడూ నమ్మ లేదని మోదీ అన్నారు. డిసెంబర్ 5వ విడత…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల కలకం రేపాయి. టీఆర్ఎస్ యూత్ నాయకులు బండి సంజయ్ ఫోటోతో పెట్టిన ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. సిరిసిల్లలోని పలు కూడళ్లలో బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలుతో ఫ్లెక్సీలు పెట్టడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఇవాళ డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందనే వాదనతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. కేంద్రం పై విరుచుకుపడ్డారు. మోడీ ముందు ఈడీ వచ్చిందని ఎద్దేవ చేశారు.
గుజరాత్ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. తొలి విడతలో మొత్తం 19 జిల్లాల్లోని 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్యలో త్రిముఖపోరు నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి.
BJP criticizes Rahul Gandhi as Chunav Hindu: గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. రాహుల్ గాంధీ మంగళవారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయాన్ని దర్శించుకున్నారు. తెల్లటి ధోతీ, నుదిటిపై విభూతి ధరించి మహాకాల్ ఆలయాన్ని సందర్శించారు. రాహుల్ ఆలయాన్ని సందర్శించడంపై బీజేపీ విమర్శలు మొదలుపెట్టింది. గుజరాత్ ఎన్నికల్లో హిందువుల ఓట్లను పొందేందుకే…
గుజరాత్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన తొలిదశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియగా.. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగియనుంది.
ఆర్థిక పరిస్థితి పై హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్దమని, ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా అని ఈటెల సవాల్ విసిరారు. ప్రజల డబ్బుతోనే ఓట్లు కొనే నీచ సంస్కృతికి కేసీఆర్ దిగజారాడని ఆరోపించారు. 2021 22 ఆర్థిక సంవత్సరం కి 36 వేల కోట్లు వడ్డీ కడుతుందని అన్నారు.