పాలమూరు జిల్లా సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు పచ్చి అబద్ధాలు అని మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. తాజాగా ఆమె మాట్లాడుతూ.. వాల్మీకి బోయాను ఎస్టీ లో చేర్చాలని కేంద్రానికి పంపినా అని చెప్పిన కేసీఆర్, పంపిన పత్రం విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో, కమీషన్లకు అలవాటు పడి లక్షల కోట్లు దోచుకున్నారని డీకే అరుణ ఆరోపించారు. వలసలు లేవని చెప్పిన కేసీఆర్ మాతో కలిసి పాలమూరు జిల్లాలో పర్యటించే దమ్ము ఉందా? అని డీకే అరుణ సవాల్ విసిరారు.
Also Read : Mumbai Woman Molested: దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం
కేసీఆర్‌కు కూతురిని మద్యం కేసు నుంచి ఎలా తప్పించాలని ఆలోచన తప్ప అభివృద్ధిపై ఆలోచన లేదని డీకే అరుణ విమర్శించారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేని కేసీఆర్, కేంద్రం అడ్డంకులు వేస్తుంది అని ప్రచారం చేసి కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని డీకే అరుణ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే.. నేడు మహబూబ్‌నగర్‌లోని పాలమూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర కాళ్లడ్డు పెడుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. జాతీయ రాజకీయాల్లో వెళ్లి దేశాన్ని కూడా తెలంగాణను అభివృద్ధి చేసిన విధంగా ముందుకు వెళ్తానన్నారు. అందుకు ప్రజల సహాయసహకారాలు ఇవ్వాలన్నారు.