బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు. కవిత చేసిన ట్వీట్ కు ఎమ్మల్యే ఈటెల స్పందించారు. షర్మిల తానా అంటే తందానా అని బీజేపీ నేతలు పరోక్షంగా ఆక్షేపించారు. వారు వదిలిన బాణం తానా అంటే తామర పువ్వులు అని ట్వీట్ చేసిన కవిత పై ఈటెల మండిపడ్డారు.
తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ రోజు పాదయాత్రతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ ఈ రెండు పార్టీలు దూకుడు పెంచాయి. వైఎస్ ఆర్టీపీ షర్మిల పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న హైడ్రామా కొనసాగింది.
Bull Runs Through Congress' Gujarat Rally, Ashok Gehlot Blames BJP: గుజరాత్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. మంగళవారంతో గుజరాత్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ సారి ఎలాగైనా గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భావిస్తోంది. అయితే బీజేపీని తట్టుకుని ఏ మేరకు పోటీ ఇవ్వనుందో చూడాలి. ఇదిలా ఉంటే చివరిరోజు కాంగ్రెస్ ముఖ్యనేతలు గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరికొంత మంది కాంగ్రెస్ నేతలు…
Minister Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. 2014నుంచి 2022వరకు మాతృమరణాలు గణనీయంగా తగ్గాయని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
Bandi Sanjay criticizes CM KCR: సీఎం కేసీఆర్ కు మూడింది.. వచ్చేదీ బీజేపీ సర్కారే అని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఐదో విడత ప్రజసంగ్రామ యాత్రలో భాగంగా బైంసాలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాగానే బైంసా పేరును ‘మహిషా’గా మారుస్తామని అన్నారు. బైంసాను దత్తత తీసుకుంటామని.. బైంసా అల్లర్ల బాధితులపై కేసులు ఎత్తేస్తాం అని వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీలు…
Etela Rajender criticized CM KCR: బైంసాలో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో నాయకులు, టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ తన చెప్పు చేతుల్లో పోలీసులను పెట్టుకున్నారని.. పోలీసులు 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర బహిరంగం సభను అడ్డుకోవాలని చూశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ విమర్శించారు. కోర్టు బహిరంగ సభకు అనుమతి ఇచ్చిందని అన్నారు. ఇంతపెద్ద పార్టీ బహిరంగ సభ రెండు గంటలే ఉంటుందా..? అని…
Kishan Reddy criticizes TRS and CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గవర్నర్ మీద గౌరవం ఉందడు.. రాజకీయ పార్టీలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులపై గౌరవం ఉందడని..ప్రధాన మంత్రికి కనీస మర్యాదు ఇవ్వరని.. యాత్రను అడ్డుకుంటారు, అక్రమ కేసులు పెడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన బహిరంగ సభలో ఆయన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుంటున్నారని.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎజెంట్ల లాగా పోలీసులు…
BJP criticizes Mallikarjuna Kharge’s ‘Ravan’ comments: మరికొన్ని రోజుల్లో గుజరాత్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగబోతోంది. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీని రావణుడితో పోలుస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ విరుచుకుపడుతోంది. ఖర్గే ‘ గుజరాత్ పుత్రుడిని అవమానిస్తున్నారు’ అంటూ బీజేపీ ఆరోపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున ఖర్గే ఈ…
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,621 మంది అభ్యర్థుల్లో 330 మంది అంటే దాదాపు 20 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం వెల్లడించింది. అలాంటి 61 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రస్థానంలో ఉంది.
తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన కేసు సంచలనం సృష్టించింది.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగిస్తుండగా.. సిట్ నోటీసులు ఇచ్చినవారు కొందరు విచారణకు డుమ్మాకొడుతున్నారు.. అయితే, ఈ కేసులో సిట్ దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని కేరళ బీడీజెస్ అధ్యక్షుడు తుషార్.. కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని విన్నవించారు.. Read Also: IT…