ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దివాళా తీయించి చిప్ప చేతికిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలకు ఏం ఒరగపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో అధికారమే లక్షంగా బీజేపీ నాయకులు దూకుడు పెంచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఆందోల్ నియోజకవర్గంలోని ప్రజాగోస-బీజేపీ భరోసా బైక్ ర్యాలీని రాయికోడ్ మండలంలోని సీరూర్ గ్రామంలో మాజీమంత్రి బాబూమోహన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
Badruddin Ajmal Apologises For Remarks On Hindus: అస్సాంకు చెందిన ఏఐయూడీఎఫ్ రాజకీయ పార్టీ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యల చేయడం దేశవ్యాప్తంగా పొలిటికల్ దుమారాని దారి తీశాయి. అయితే ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు బద్రుద్దీన్. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశ్యం లేదని, హిందువులపై చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా అంటూ శనివారం ప్రకటించారు. సీనియర్ నాయకుడిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని.. నా వ్యాఖ్యలతో బాధపడుతున్న ప్రతీ ఒక్కరికీ నేను క్షమాపణలు చెబుతున్నానని…
Delhi Civic Polls Today: బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కోసం అంతా సిద్ధం అయింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 250 వార్డులకు 1349 మంది పోటీలో నిలబడ్డారు. 1.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసుగు చెందారు.. వైసీపీ పాలన నుండి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీలకు ఉత్తుత్తి పదవులు ఇచ్చి వైసీపీ మోసం చేసిందని ఆరోపించారు.. ఎవరికి కావాలంటే వారికి కార్పోరేషన్ పదవులు ఇచ్చారు.. కాపులు, బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది విమర్శించారు.…