TS Assembly Budget Session: తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి రేపు ఉదయం గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఇక, ఫిబ్రవరి 6న అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు ఆర్థికమంత్రి హరీష్ రావు. ఈనెల 15 వరకు సమావేశాలుంటాయని తెలుస్తోంది. బీఏసీ భేటీ తర్వాత.. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నదానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం వుంది. అయితే, గవర్నర్ ప్రసంగంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. సయోధ్య తర్వాత…
Uniform Civil Code: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలియజేసింది. యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి సిఫారసులు చేయాలని ప్రభుత్వం 21వ లా కమిషన్ ను కోరిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Maharashtra: మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, డిఫ్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సొంత ఇలాకాలో బీజేపీ ఓడిపోయింది. బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి చేతిలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో నాగ్పూర్ స్థానం నుంచి ఎంవీఏ బలపరిచిన అభ్యర్థి సుధాకర్ అద్బలే విజయం సాధించారు. బీజేపీ మద్దతు ఉన్న…
MP govt renames Bhopal's Islam Nagar village as Jagdishpur: ఇటీవల కాలంలో పలు ప్రాంతాల పేర్లను మార్చి కొత్త పేర్లను పెట్టడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు పట్టణాల పేర్లను మార్చివేడయం చూశాం. యోగీ సర్కార్ ఉత్తర ప్రదేశ్ లో కొలువుదీరిన తర్వాత అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, ముస్తాఫాబాద్ ను రాంపూర్ గా, ఫిరోజాబాద్ ను చంద్రానగర్ గా, మొగల్ సరాయ్…
Mamata Banerjee criticizes BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బును బీజేపీ తన పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు ఉపయోగిస్తోందిని మంగళవారం దీదీ ఆరోపించారు. పుర్బా బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యలపై ఉత్తరాఖండ్ మంత్రి గణేష్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. బలిదానం అనేది గాంధీ కుటుంబానికి చెందిన గుత్తాధిపత్యం కాదని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు ప్రమాదాలేనని మంత్రి గణేష్ జోషి మంగళవారం అన్నారు.