అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శాసన సభలో మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయన్నారు.
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఇన్ఛార్జిగా బీజేపీ శనివారం నియమించింది. కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ ఇప్పటినుంచే పావులు కదుపుతోంది.
UP, Maharashtra Legislative Council Election Results: ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ హావా కనిపిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వరసగా ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోంది. తాజాగా శాసనమండలి జరిగిన ఎన్నికల్లో కీలక విజయం సొంతం చేసుకుంది బీజేపీ. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటిని గెలుచుకుంది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. సమాజ్ వాదీ పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కించుకోవాలనే ఆశలను బీజేపీ…
Off The Record: గాలిలో కాకుండా గ్రౌండ్లో ఉండి పనిచేయాలని తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఢిల్లీ పార్టీ పెద్దలు. కేవలం చెప్పి వదిలేయడమే కాకుండా ఏం చేయాలో.. ఏమేమి చేయాలో పూసగుచ్చినట్టు వెల్లడిస్తున్నారట. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి కొన్ని షరతులు పెట్టడంతో వాటిపైనే పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గ్రౌండ్ లెవల్ రియాలిటీని వెంటనే తెలుసుకోవడం కోసం.. ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి ఒక యాప్ను సిద్ధం చేసింది బీజేపీ. పార్టీ నేతలంతా…
Kerala Budget: కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. పెట్రోల్, డిజిల్, మద్యంపై సెస్ విధించడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బడ్జెట్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. శుక్రవారం కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. డిజిల్, పెట్రోల్, మద్యంపై సెస్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ 2023-24 వార్షిక బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు సభ ప్రారంభమైంది. ఇవాళ తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించారు.