AP Special Status: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీ ఏపీకి ప్రత్యేక హోదా.. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయింది.. ఏపీకి ప్రత్యేక హోదా అమలుకు నోచుకోలేదు.. అయితే, ఎప్పటి కప్పుడు ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ లాంటి చర్చలు మాత్రం సాగుతూనే ఉన్నాయి.. తాజాగా, ఏపీకి ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రత్యేక హోదా ముగిసిన అద్యాయం కాదన్నారు.. అయితే, ప్రత్యేక ప్యాకేజ్ చంద్రబాబు హయాంలోనే ఇచ్చామన్నారు.. పార్లమెంట్ సాక్షిగా 15 వేల కోట్లు ఇచ్చామని గుర్తు చేసుకున్న ఆయన.. ఇంకొన్ని నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు.
Read Also: Solar Parks: రూ.16,400 కోట్లతో ఏపీలో 5 సోలార్ పార్క్‌ల ఏర్పాటు..
ఇక, రాష్ట్రంలో రెండు కుటుంబ పార్టీలు, దోపిడీ పార్టీలు అంటూ వైసీపీ, టీడీపీపై విమర్శలు గుప్పించారు సోము వీర్రాజు.. గ్రామాల్లో పాదయాత్ర చేసి లక్ష సమస్యలు సేకరించి వైఎస్ జగన్ ప్రభుత్వం పై ఛార్జ్ షీట్ ప్రవేశ పెడతాం అన్నారు. కర్ణాటకలో తుంగభద్రపై నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుతో రాయలసీమకు దక్కాల్సిన వాటాలో అన్యాయం జరగకుండా చూస్తామని ప్రకటించారు.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా సాగుతోన్న పొత్తుల వ్యవహారంపై స్పందించిన ఆయన.. చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే, ప్రస్తుతం ఏపీలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉండగా.. జనసేతో తెలుగుదేశం పార్టీ పొత్తుకు ప్రయత్నాలు సాగిస్తోంది.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కూడా ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుంది అనే తరహాలోనే ఉన్నాయి.. కానీ, జనసేనతో ఓకే.. టీడీపీతో మాత్రం కలిసేది లేదని చెబుతోంది బీజేపీ.