Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దీర్ఘకాలిక పదవీ విరమణ సమస్యను పార్లమెంట్‌లో లేవనెత్తారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిబద్ధత మరియు కృషిని కొనియాడుతూనే.. ఉద్యోగుల సమస్యలను పార్లమెంటులో ఉక్కు శాఖ మంత్రిని గట్టిగా నిలదీశారు.. విశాఖ ఉక్కు కర్మాగారంగా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పదవీ విరమణ జరుగుతున్న ఉద్యోగుల సమస్య వలన క్షీణిస్తున్న మానవ వనరుల పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలని, తద్వారా ఉత్పన్నమయ్యే ఇతర సమస్యలను గురించి ఉక్కు మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు జీవీఎల్.. ఇక, దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సమాధానమిస్తూ.. పూర్తి స్థాయి కార్యకలాపాల కోసం ఉద్యోగుల పునర్ వ్యవస్థీకరణ చేస్తామని, మిగతా కార్యకలాపాలకు ఔట్ సోర్సింగ్‌ను ఆశ్రయిస్తామని తెలియజేశారు.
Read Also: Ponguleti Srinivas Reddy: పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. !
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఉక్కు మంత్రిత్వ శాఖకు ప్రశ్నలు సందించిన జీవీఎల్.. ఆర్ఐఎన్ఎల్ లోని సిబ్బంది పరిస్థితిపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే సమాధానమిస్తూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం 14,880 మంది ఉద్యోగులు ఉన్నారని, గత మూడేళ్లలో 1,987 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, వచ్చే మూడేళ్లలో 1,170 మంది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు, 2,039 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు సహా 3,209 మంది ఉద్యోగులు ఆర్ఐఎన్ఎల్ రికార్డుల ప్రకారం పదవీ విరమణ చేయనున్నారని తెలిపారు.. అయితే, పెద్ద ఎత్తున ఉద్యోగుల పదవీ విరమణ కారణంగా ఏర్పడుతున్న సిబ్బంది కొరతను విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా ఎదుర్కొంటుందని జీవీఎల్ ప్రశ్నించగా, అంతగా ప్రాధాన్యత లేని కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్ చేయడం ద్వారా, ప్రధాన కార్యకలాపాల్లో సిబ్బందిని పునర్ వ్యవస్థీకరణ ద్వారా మానవ వనరుల అవసరాలను తీర్చుతున్నామని పేర్కొన్నారు. ఉద్యోగుల కొత్త నియామకాల గురించి ఎంపీ జీవీఎల్ ప్రశ్నించగా కొత్త నియామకాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, గత మూడేళ్లలో 106 మంది కొత్త ఉద్యోగులను నియమించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆర్ఐఎన్ఎల్ లో పెద్ద ఎత్తున పదవీ విరమణల పరిస్థితిపై ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ, ఆర్ఐఎన్ఎల్ యొక్క ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ మంచి పనితీరు కనబరిచిన ఆర్ఐఎన్ఎల్ ఉద్యోగుల కృషిని ప్రశంసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ సిబ్బందికి సంస్థపై కల అభిమానం మరియు వారినిబద్ధత వల్లనే ఆ స్థాయి ఉత్పాదకత సాధ్యమైందని వ్యాఖ్యానించారు.