PM Narendra Modi's speech in Parliament: పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. విపక్షాల చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. మోడీపై బురదజల్లి లబ్ధిపొందాలని విపక్షాలు అనుకుంటున్నాయి. పేపర్లు, టీవీల్లో మోడీని విమర్శించి లబ్ధిపొందలేరు.. నా జీవితాన్ని దేశం కోసం అంకితం చేశా.. దేశ ప్రజలకు నాపై విశ్వాసం ఉంది, అది విపక్షాల అంచనాకు అందదు అని అన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాడమే నాకు రక్ష అని.. ఈ…
PM Narendra Modi's speech in Parliament: పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రపతి దేశంలోని మహిళలు, సోదరీమణులకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. రాష్ట్రపతి దేశంలో గిరిజనులు ఉన్నతిని పెంచారని అన్నారు. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి, యుద్దం లాంటి పరిస్థితులను భారత్ తట్టుకుందని మోదీ అన్నారు. ఎన్నికల కంటే దేశంలోని 140 కోట్ల ప్రజల సామర్థ్యం, శక్తి గొప్పదని అన్నారు. సమర్థవంతంగా భారత్ సంక్షోభాల నుంచి బయటపడిందని,…
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పార్లమెంటులో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం త్రివర్ణ పతాకంలో ఆకుపచ్చ రంగును తొలగిస్తుందా..? అని ప్రశ్నించారు. పచ్చదనంలో ప్రభుత్వానికి ఎందుకు ఇన్ని ఇబ్బందులు అని అడిగారు. చైనా చొరబాటుపై ప్రధాని మోదీ మాట్లాడరా..? బిల్కిస్ బానోకు న్యాయం చేస్తారా.? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే ఎర కేసులో సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఈ నెల 17న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఈరోజు సీజేఐ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు.ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో మెరిట్‌లు ఉంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను తిప్పికొడతామని…
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభలో గౌతమ్ అదానీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాలను చూపించి పెద్ద రచ్చ సృష్టించారు. గౌతమ్ అదానీకి ప్రభుత్వానికి ఉన్న సంబంధాలపై, దేశంలో సంపదపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.
AP Special Status: కాంగ్రెస్, బీజేపీ సంయుక్త వైఫల్యాల వల్లే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది అంటూ రాజ్యసభలో మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన విజయసాయి రెడ్డి.. ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, జనాభా ప్రాతిపదికపై బీసీలకు రిజర్వేషన్లు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు ,విశాఖ మెట్రో అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశారు విజయసాయి…
AP Special Status: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీ ఏపీకి ప్రత్యేక హోదా.. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయింది.. ఏపీకి ప్రత్యేక హోదా అమలుకు నోచుకోలేదు.. అయితే, ఎప్పటి కప్పుడు ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ లాంటి చర్చలు మాత్రం సాగుతూనే ఉన్నాయి.. తాజాగా, ఏపీకి ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు..…