KCR: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ?.. తెలంగాణకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారన్నారు. తెలంగాణరకు నిధులు ఇవ్వాలని ఏడేళ్ల నుంచి అడుగుతున్నామన్నారు. కానీ అధికార ప్రతిపక్షాలు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే నువ్వెన్ని అంటూ మోడీ, రాహుల్ గొడవపడుతున్నారన్నారు.
ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంది?. బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? . పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. ఢిల్లీకి కూడా నీళ్లు ఇవ్వడం లేదన్నారు కేసీఆర్. మోడీ కంటే మన్మోహన్‌సింగ్ ఎక్కువ పనిచేశారు. ఆయన బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసిందని బీజేపీని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ బాగా పనిచేయలేదని 2014లో మోడీకి ఓటేశారు.. పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది.. మన్మోహన్ కంటే మోడీ పాలనలో దేశం ఎక్కువ నష్టపోయింది. దేశం పరిస్థితి క్రిటికల్‌గా ఉంటే మోడీ మాట్లాడట్లేదని కేసీఆర్ అన్నారు.
Read Also: Bandi Sanjay: అధికారంలోకి వస్తే కొత్త సచివాలయ డోమ్‌లు కూల్చేస్తాం
ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకునే ధైర్యం ఉండాలన్నారు కేసీఆర. తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ ర్యాంక్ తక్కువ.. 5ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్.. భారత్ 3.3 ట్రిలయన్ డాలర్ల దగ్గరే ఆగిపోయిందన్నారు కేసీఆర్.. మొత్తం 192 దేశాల్లో భారత్ ర్యాంక్ 139. మోడీకి సలహాలు ఇచ్చేవాళ్లు సరిగ్గా ఇవ్వాలన్నారు. కొద్దిగా మంచి పనులు చేయాలని మోడీకి చెప్పాలి.. గోద్రా అల్లర్లపై డాక్యుమెంట్ చేస్తే బీబీసీని బ్యాన్ చేయాలా?.. బీబీసీని బ్యాన్ చేయాలని బీజేపీకి చెందిన లాయర్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. అప్పులు చేయడంలో మోడీని మించిన ఘనుడు లేడని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లు చేసిన పనిని కూడా చెప్పుకోలేకపోతున్నారు. మన్మోహన్ హయాంలో 14 శాతం అప్పులు తగ్గించారని ప్రశంసించారు. మోడీ హయాంలో అప్పులు 54 శాతం పెరిగాయి. మోడీ హయాంలో ఎక్కడైనా వృద్ధి రేటు ఉందా.. అని సీఎం ప్రశ్నించారు.
Read Also: Banda Prakash : శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఎన్నిక
2024 తర్వాత బీజేపీ ఖతమన్నారు సీఎం కేసీఆర్.. బంగ్లాదేశ్ వార్ తర్వాత ఇందిరాగాంధీని వాజ్‌పేయి కాళికా అన్నారు.. అలహాబాద్ కోర్టు తీర్పుతో ఇందిరాగాంధీ ప్రభుత్వం కూలిపోయింది.. తర్వాత వచ్చిన జనతా పార్టీ కొన్ని తప్పులు చేసింది… అనంతరం మళ్లీ ఇందిరాగాంధీకే పట్టం కట్టారన్నారు కేసీఆర్. తాను చెప్పినదాంట్లో ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తానంటూ అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేశారు. మేకిన్ ఇండియా జోకింగ్ ఇండియా అయ్యిందన్నారు.. తన మాటకు కట్టుబడి ఉంటా.. కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని ముంచాయి.. కాంగ్రెస్‌ది లైసెన్స్‌రాజ్, మోడీది సైలెన్స్‌రాజ్.. NDA అంటే నో డేటా అవైలబుల్. అంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు.