V. Hanumantha Rao: బీబీసీ ని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V. Hanumantha Rao: బీబీసీ ని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు మండిపడ్డారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మూడున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామన్నారు. జై భీమ్ నాయకులు పెట్టిన విగ్రహాన్ని కూల్చడంతో పాటు ఆనాడు నేను తీసుకొచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడ పోలీస్ లు తీసుకుపోయారని తెలిపారు వీహెచ్. మేము ఎన్ని పోరాటాలు చేసిన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్ట్ మాత్రం అంబేద్కర్ విగ్రహాన్ని నాకు ఇచ్చేయాలని చెప్పిందన్నారు. విగ్రహాన్ని నాకు ఇవ్వడం కాదు ఎక్కడ నుండి తీసుకెళ్లారో అక్కడే విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కోసం మట్లాడారని, నేను బట్టి విక్రమార్క కేటీఆర్‌ని కలిస్తే అంబేద్కర్ విగ్రహ ఎర్పాటు విషయంలో సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు. జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టడానికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. బీబీసీ ని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పఅని వ్యాఖ్యానించారు. పత్రికలు ద్వారానే మనకు స్వాతంత్రం వచ్చిందని, వాస్తవాల్ని బీబీసీ చూపించిందని పేర్కొన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమా లేక డిక్టేటర్ దేశమా? అని ప్రశ్నించారు. బీజేపీ చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Kishan Reddy: కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్.. దేశ ఆర్థిక పరిస్థితి పై చర్చకు సిద్ధమా?
Also Read
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
- Night Bus Services: హైదరాబాద్‌లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
- TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఇండియాతో పాటు బ్రిటన్ లో కూడా వివాదాస్పదం అయింది ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంట్. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాత్రపై బీబీసీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిపై బీజేపీతో తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత ప్రభుత్వం దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. బ్రిటన్ పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరిగింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ భారత ప్రధానిపై విమర్శలు చేస్తే, పలువురు ఎంపీలు మోదీకి మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంట్ నేపథ్యంలో బీబీసీని నిషేధించాలని హిందూ సేన చీఫ్ విష్ణుగుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు నిషేధాన్ని తిరస్కరించింది. దీన్ని తప్పుడు భావనగా పేర్కొంది. ఒక డాక్యుమెంటరీ దేశంపై ఎలా ప్రభావం చూపుతుందని ప్రశ్నించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్.. బీబీసీ ఉద్దేశపూర్వకంగా భారత ప్రతిష్టను కించపరుస్తుందని వాదించారు. ఈ డాక్యుమెంటరీ వెనక కుట్ర దాగి ఉందని ఎన్ఐఏతో విచారణ దర్యాప్తు చేయాలని కోరారు. ఈ డాక్యుమెంటరీ లింకులను తొలగించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్, యూట్యూబ్ లను ఆదేశించింది.
Kamareddy Master Plan: హైకోర్టు కీలక నిర్ణయం.. చెప్పకుండా చేయొద్దని తెలంగాణ సర్కార్ కి ఆదేశం
తాజావార్తలు
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!