Cops Move In To Arrest Separatist Leader Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వివాదాస్పద అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు సిద్ధం అయ్యారు. పంజాబ్ పోలీస్ స్పెషల్ టీం శనివారం అతని మద్దుతుదారులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మోగా జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు. రేపు మధ్యహ్నం 12 గంటల వరకు పంజాబ్ అంతటా ఇంటర్నెట్ నిలిపివేశారు. జీ20 ఈవెంట్ పంజాబ్ లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అమృత్…
తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే మాట్లాడినా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు ఇవాల హాజరయ్యారు.
డివిజనల్ హెడ్‌క్వార్టర్‌కు దూరంగా నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి 19 కొత్త జిల్లాలు, మరో మూడు డివిజనల్ హెడ్క్వార్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఇవాల ఉదయం 11 గంటలకు మహిళ కమిషన్ ముందుకు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ హాజరు కానున్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదని, కాంగ్రెస్ పార్టీకే ప్రమాదం ఉందని అన్నారు. దేశంలో ప్రమాదంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకే తప్ప ప్రజాస్వామ్యానికి కాదన్నారు.
Amit Shah: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యే ఎన్నికలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందడంపై కేంద్ర హోమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా గెలిచిన అభ్యర్థికి, బీజేపీ కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలియజేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డికి, ఆయన గెలుపు కోసం పనిచేసిన బీజేపీ శ్రేణులకు అమిత్…
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరో 7 రోజులు సిసోడియాను విచారించేందుకు సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టును కోరింది. అయితే కోర్టు మరో 5 రోజుల కస్టడీకి అప్పగించింది.
Mallikarjun Kharge: ‘జాతీయ వ్యతిరేక టూల్ కిట్’లో రాహుల్ గాంధీది శాశ్వత భాగస్వామ్యం అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే విరుచుకుపడ్డారు. బీజేపీనే దేశ వ్యతిరేకుల పార్టీ అని, వారు భారతస్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదని ఆయన అన్నారు. బ్రిటిష్ వారి కోసం పని చేశారని దుయ్యబట్టారు. ఇంత చేసినవారు ఇతరులను దేశ వ్యతిరేకులుగా పిలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
లండన్‌లో ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. వయనాడ్ ఎంపీ విదేశీ గడ్డపై దేశాన్ని పరువు తీశారని అన్నారు.